రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ముసురుకున్న మేఘాలు తొలిగిపోయాయి. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పైగా.. ఇప్పటికే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో తాము వేలు పెట్టేది లేదని కూడా స్పష్టం చేసింది. ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. రెండు రాజ్యాంగ బద్ధ సంస్థకు అందరూ సమానులే.. అనే వ్యాఖ్య చేయడం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని పేర్కొన్న ధర్మాసనం.. అక్కడ లేని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు? అనేది ప్రధాన ప్రశ్న.
ప్రభుత్వం ఈగోకు పోతోందన్నది సుప్రీకోర్టు చేసిన మరో కీలక వ్యాఖ్య. రాజ్యాంగ బద్ధమైన సంస్థల విషయంలో ప్రభుత్వాలు సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. ఎన్నికలను వాయిదా వేయడం.. వేయించడం.. అలవాటుగా మారిందనే తీవ్ర వ్యాఖ్యలుకూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హైకోర్టు ఈ ఎన్నికలపై తీర్పు చెప్పిన దరిమిలా.. అప్పటికే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం కోరడం అసమంజసంగా ఉందనేది సుప్రీం భావన.
ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంల ప్రభుత్వం.. ఎన్నికల సంఘానికి సంపూ ర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించడమే ప్రజాస్వామ్య ప్రభు త్వమే మాటకు అర్ధం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోర్టులపేరుతో ప్రజా ధనం చాలానే వృధా అయింది. ఇప్పుడు కూడా ఇంకా పంతాలకు పోవడం వల్ల.. ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టే చెప్పినట్టు.. ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on January 25, 2021 3:13 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…