ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం ఓటర్లపై ఎంతవరకు పడింది అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక డిజిటల్ విధానాల ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేసిందనే దానిపై చర్చించారు. మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం..టీడీపీకి చెందిన సీనియర్ మంత్రులతో చంద్రబాబు ఈ విషయంపై ఆరా తీసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచారంతో పాటు డిజిటల్ వ్యూహాలకు సంబంధించిన కీలక అంశాలపై ఆయన వారితో చర్చించారు.
కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకునేలా ఒక నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసింది. ఈ విధానానికి సంబంధించిన ప్రత్యేక జీవోను కూడా తీసుకువచ్చింది. నెలకు రూ. 1.5 లక్షల వరకు గౌరవ వేతనం ఇచ్చేలా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించాలని నిర్ణయించింది.అయితే.. కొన్ని కారణాలతో ఈ విధానం పూర్తిగా అమలు కాలేదు. అయినప్పటికీ మెజారిటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు.. స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం కూటమి భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్లు గెలుచుకున్న దరిమిలా.. వీరి ప్రభావం ఏమేరకు ఉందన్న విషయంపై చంద్రబాబు ఆరా తీసినట్టు తెలిసింది.
ఇటీవల ముగిసిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం ఓట్లలో కూటమికి 58.90 శాతం ఓట్లు రాగా, వైసీపీ 33.56 శాతానికి పరిమితమైందని చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. ఈ ఎన్నికల విజయాల అనంతరం, రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాను, ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల నెట్‌వర్క్‌ను క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎలా వాడుకోవాలనే దానిపై కూటమి నాయకత్వం మరింత దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాజాగా ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంపై చర్చించారు. దీనిపై మంత్రులు కూడా తాము సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం బాగుందని.. వాట్సాప్‌లోనూ కొందరు ప్రచారం చేశారని మంత్రులు వివరించారు.
నియమకాలకు పచ్చజెండా!
ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల నియామకాలకు సీఎం పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. కొన్ని కారణాలతో నిలిచిపోయిన ఈ విధానాన్ని గాడిలో పెట్టాలన్నారు. అయితే.. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డిసెంబరు వరకు నియామకాలు చేపట్టే పరిస్థితి లేదని.. అదేసమయంలో కొందరు కోర్టుకు వెళ్లేయోచనలో ఉన్నారని మంత్రులు వివరించారు. మొత్తంగా ఇన్‌ఫ్లుయెన్సర్ల పనితీరుపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on November 10, 2026 9:46 pm
ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అంటే బ్యాటింగ్ ఫైర్ అనేవాళ్లు. ట్రిపుల్ సెంచరీ దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొట్టాలంటే దానికి చాలా…
ప్రాణాలు విడిచిన భర్తకు.. ఇప్పటి వరకు ఏ భార్యా తలకొరివి పెట్టిన సంఘటనలు జరగలేదు. ఆ దంపతులకు కుమారులు లేకపోతే..…
అక్కినేని నాగార్జున కెరీర్ లో గీతాంజలి ఎంత ఎవర్ గ్రీన్ క్లాసిక్కో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ చెప్పారనో.. లేక ఆయన మెప్పు పొందాలనో భావించిన కొందరు ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.…
చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్…
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…