Movie News

సూర్య నుండి చాలా నేర్చుకోవాలి

ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అంటే బ్యాటింగ్ ఫైర్ అనేవాళ్లు. ట్రిపుల్ సెంచరీ దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొట్టాలంటే దానికి చాలా దమ్ము కావాలి. కానీ దాన్ని చాలా తేలికగా చేసి చూపించిన గట్స్ సెహ్వాగ్ సొంతం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే అచ్చం ఇదే తరహాలో ఒకే ఏడాదిలో సూర్య మూడు సూపర్ హిట్స్ అందుకోవడం చూసి ఇతర హీరోలు ఈర్ష్య పడుతున్నారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండేళ్లకు ఒక విజయం అందుకోవడమే గగనమైన టైంలో సూర్య సాధించిన ఫీట్ చాలా గొప్పది.

వీరభద్రుడు అలియాస్ కరుప్పు మూడు వందల కోట్లు సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు వందల యాభై కోట్ల మార్కుని చేరుకుంది. తాజాగా సీన్ ఆల్రెడీ నూటా యాభై కోట్లను దాటేసి కొత్త టార్గెట్లు పెట్టుకుంటోంది. అది కూడా రామాయణ లాంటి ప్యాన్ ఇండియా పోటీని ఎదురుగా పెట్టుకుని. మూడు సంబంధం లేని వేర్వేరు జానర్లు. అన్నింటిలో సూర్యని ఆదరించారు. రెట్రో, కంగువ మిగిల్చిన తీవ్రమైన గాయాలకు అద్భుతమైన ముందుగా పని చేశాయి.

ఎవరేం అనుకున్నా సూర్య నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా స్పీడ్. తక్కువ టైంలో ఎక్కువ బడ్జెట్, రిస్కులు లేకుండా సరైన ప్లానింగ్ ఉంటే చెప్పిన టైంకి సినిమాలు రిలీజ్ చేయొచ్చని నిరూపించాడు. దర్శకులను నమ్మడంలో తనదైన మార్కు వదులుకోకుండా ఆర్జె బాలాజీ, జీతూ మాధవన్ మీద కాన్ఫిడెన్స్ చూపించడం ద్వారా గొప్ప ఫలితాలు అందుకున్నాడు. ఒక్క వెంకీ అట్లూరి మాత్రమే సూర్యని హ్యాండిల్ చేసిన సీనియర్ దర్శకుడు.

ఇప్పుడు నిర్మాణంలో సూర్య కొత్త సినిమా కూడా ఆల్రెడీ డెబ్భై శాతం షూటింగ్ పూర్తయ్యిందట. ఏప్రిల్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒకవేళ వారణాసి ఉంటే మటుకు మే లేదా జూన్ కు వెళ్ళిపోతారు. టాలీవుడ్ టయర్ 2 హీరోలు తన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. పాన్ ఇండియా మత్తులో పడి వెయ్యి కోట్లు సాధించాలనే భ్రమలో చాలా విలువైన కాలాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. దీని వల్ల నిర్మాతలే కాదు ఇండస్ట్రీ కూడా తీవ్రంగా నష్టపోతోంది. దీన్ని ముందు నివారించాలి. 

This post was last modified on November 10, 2026 6:45 pm

Share

Recent Posts

ఫ‌స్ట్ టైమ్‌: భ‌ర్త‌కు అన్నీ తానై.. త‌ల‌కొరివి పెట్టిన భార్య‌!

ప్రాణాలు విడిచిన భ‌ర్త‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార్యా త‌ల‌కొరివి పెట్టిన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు. ఆ దంప‌తుల‌కు కుమారులు లేక‌పోతే..…

1 hour ago

గీతాంజలి కోసం బాధ పడుతున్నారు

అక్కినేని నాగార్జున కెరీర్ లో గీతాంజలి ఎంత ఎవర్ గ్రీన్ క్లాసిక్కో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో…

3 hours ago

రిటైర్మెంట్ వరకు ఊరట లేనట్టే.. సంజయ్‌కు మరో దెబ్బ!

వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చెప్పార‌నో.. లేక ఆయ‌న మెప్పు పొందాల‌నో భావించిన కొంద‌రు ఉన్న‌తాధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు.…

6 hours ago

పుణ్యం వస్తుంది ఇలాంటి ఆఫర్లు పెడితే

చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్…

7 hours ago

పెండింగ్ కేసులకు ఫాస్ట్ ట్రాక్.. ఏపీకి రానున్న ఈవెనింగ్ కోర్టులు..

దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…

7 hours ago

డేంజర్ గేమ్ ఆడుతున్న విశ్వంభర

ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…

7 hours ago