Political News

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ వైవాహిక జీవితం ముగిసినా ఇకముందు మంచి స్నేహితులుగా కొనసాగాలని, తమ పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా వ్యవహారించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు . ఈ సమయంలో తమను అర్థం చేసుకుని, సానుభూతితో వ్యవహరించాలని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని వారిద్దరూ రిక్వెస్ట్ చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ ను రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు గౌరవించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీలు తమ శ్రేణులకు ఆల్టిమేటం ఇచ్చాయి. ఐటీడీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్, అన్నా విడాకుల గురించి సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి ద్వారా విమర్శలు చేసినా, ఎలాంటి కామెంట్స్ చేసినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఒకవేళ ఎవరైనా టీడీపీ నాయకుల పేరుతో చేసే వ్యక్తిగత విమర్శలకు, కించపరిచే వ్యాఖ్యలకు ఐటీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నేతల గోప్యతను గౌరవించాలని, బహిరంగంగా వ్యాఖ్యానించ వద్దని సూచించింది . రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండా ఒక రాజకీయ నాయకుడి వ్యక్తిగత విషయానికి సంబంధించి సోషల్ మీడియా వేదికపై విమర్శలు, కామెంట్స్ వస్తున్నట్లు గమనించామని, వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా విచక్షణ పాటించాలని కోరింది.

పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో. మంచి బాండింగ్ వుంది. పైగా టీడీపీ, జనసేన పార్టీలు కూటమిలో కలిసే వున్నాయి. అధికారంలో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. కనుక టీడీపీ పాజిటివ్ గా స్పందించింది. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ విమర్శలు చేసిన ప్రతిపక్ష వైసీపీ కూడా ఈసారి సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఏపీలో కూటమి, వైసీపీ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా వున్నప్పటికి పవన్ కళ్యాణ్ విడాకుల విషయంలో పాజిటివ్ గా స్పందించడం మంచి పరిణామం అని చెప్పొచ్చు.

This post was last modified on November 10, 2026 1:27 pm

Share

Recent Posts

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…

17 minutes ago

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

2 hours ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

2 hours ago

ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్

తెలంగాణాలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో సఫలం అయిన…

3 hours ago

సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం: నాగార్జున

ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం తాము అదృష్టవంతులమని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా…

3 hours ago

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…

5 hours ago