Movie News

రామ్‌చరణ్ రావడం అర్జునకి ప్లస్సవుతుందా

ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక కొత్త హీరోకి ఇంత సపోర్ట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఎవరికీ జరగలేదు. కుర్రాడి తండ్రి నేపధ్యం ఇందుకు కారణం అయినప్పటికీ పబ్లిసిటీ ఖర్చు విషయంలో వెనక్కు తగ్గకుండా ముందుకు వెళ్లడం ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. నిన్న చరణ్, అఖిల్ అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఫ్లైట్ ప్రయాణం వల్ల అఖిల్ త్వరగా మాట్లాడి వెళ్ళిపోయాడు కానీ రామ్ చరణ్ ముక్తసరిగా కాకుండా హీరో అనీష్ ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు కాకా ప్రస్తావన తేవడం లాంటివి బాగానే పేలాయి. అంతే కాదు తన మతిమరుపుని మరోసారి తన స్టయిల్ లోనే బయట పెట్టుకోవడం అసలు ట్విస్టు. అనీష్ డెబ్యూతోనే మూగవాడిగా నటిస్తున్నాడని, తాను రంగస్థలంలో ఆల్రెడీ మూగవాడిగా చేశానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎందుకంటే అందులో చిట్టిబాబు చెవిటి వాడు. మాటలు రానివాడు కాదు.

నాగార్జున మీద తన గౌరవం ప్రదర్శించడంతో పాటు తమన్ ని ఆత్మీయంగా మెచ్చుకుంటూ సన్నబడటం మీద కామెడీ చేయడం వగైరాలన్నీ బాగా కుదిరాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో మెల్లగా వైరలవుతున్న టైంలో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ విడాకుల వార్త బాంబులాగా మీద పడటంతో ఒక్కసారిగా అటెన్షన్ అటువైపు వెళ్ళిపోయింది. మూడోసారి వైవాహిక జీవితాన్ని బ్రేక్ చేసుకున్న పవన్ మీద లెక్కలేనన్ని ట్వీట్లు, వార్తలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అంత ఈజీగా ఆగేలా లేవు.

అసలే ఇట్లు అర్జున నాలుగైదు వాయిదాలు వేసుకుని నవంబర్ 13 వస్తోంది. రిలీజ్ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. టాక్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి టైంలో చరణ్ లాంటి గెస్టు వచ్చి సినిమాకి ఎలివేషన్ ఇవ్వడం ఖచ్చితంగా ప్లస్సే. కాకపోతే సరిగ్గా ఇదే టైంలో జరిగే సామజిక విషయాలు ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ బడ్జెట్ పరంగా ఎక్కువ రిస్క్ చేస్తున్నది మాత్రం ఇట్లు అర్జుననే. చూడాలి ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో.  

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…

23 minutes ago

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…

36 minutes ago

మంగళవారం వచ్చినా మోత తగ్గడం లేదే

రామాయణ పార్ట్ 1 వసూళ్లు కొత్త చరిత్ర రాస్తున్నాయి. మొదటి వారం కాకుండానే 700 కోట్ల వైపు పరుగులు పెడుతున్న…

59 minutes ago

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

2 hours ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

3 hours ago

ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్

తెలంగాణాలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో సఫలం అయిన…

3 hours ago