Political News

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ పార్టీ బ‌లం ఏంటో తేలిపోయింది. నిజానికి ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేసింద‌ని జ‌గ‌న్ చెబుతున్నా.. అలా లేద‌ని ఈ ఎన్నిక‌లు సుస్ప‌ష్టం చేశాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీని సంస్థాగ‌తంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి, 2029 సార్వత్రిక ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయడానికి జగన్ పాద‌యాత్రే ప్రాణం పోస్తుంద‌ని చెబుతున్నారు.

షెడ్యూల్ కంటే ముందే..
జగన్ త‌న పాద‌యాత్ర‌పై ఇప్ప‌టికే ఒక షెడ్యూల్‌నుదాదాపు ఖ‌రారు చేసుకున్నారు. కానీ, ప్ర‌స్తుత ఫ‌లితం త‌ర్వాత‌.. ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. తొలుత ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జ‌గ‌న్‌-2.0 పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2029 ఎన్నికలలోపు దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ సుదీర్ఘ పాదయాత్ర సాగనుంది. కానీ, ఇప్పుడు దీనిని మూడు నాలుగు మాసాల ముందుకు జ‌రిపి.. సుదీర్ఘ స‌మ‌యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

2024 ఎన్నికల ఓటమి తర్వాత కుంగిపోయిన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడానికి, ప్రజలతో నేరుగా మమేకం కావడానికి పాదయాత్రే ఏకైక మార్గమని వైసీపీ భావించింది. ఇప్పుడు స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన భారీ ఓట‌మి కూడా.. ఈ అంచ‌నాకు మ‌రింత అదునుగా మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను, ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుంద‌ని చెబుతున్నా.. అంత‌కు మించి పార్టీ ప‌రంగా పుంజుకునేందుకు కూడా పాద‌యాత్ర అత్యంత ముఖ్యంగా మార‌నుంది.

“గతంలో 2017 నవంబర్ 6న జగన్ ప్రారంభించిన 341 రోజుల ‘ప్రజా సంకల్ప యాత్ర’ (3,648 కి.మీ) ఏ విధంగానైతే 2019లో వైసీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టిందో, అదే సెంటిమెంట్‌తో, ప్రజా బలాన్ని నమ్ముకుని మరోసారి క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మాకు పూర్తిస్థాయిలో తెలిసింది. మేం చాలా క‌ష్ట‌ప‌డాలి.” అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నాయ‌కుడు మాజీ మంత్రి ఒక‌రు తెలిపారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలలో క్యాడర్ ఉత్సాహంగా ఉంద‌ని గుర్తించామ‌న్నారు. అయితే.. వారిని న‌డిపించే నాయ‌క‌త్వంలోనే లోపాలు ఉన్నాయ‌ని.. పాద‌యాత్ర స‌మ‌యంలో ఆయా లోపాల‌ను స‌రిచేసే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని మాజీ మ‌త్రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా.. వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా పాద‌యాత్ర ఒక్క‌టే ఇప్పుడు ప్ర‌ధాన ఆద‌రువుగా క‌నిపిస్తోంది.

This post was last modified on November 10, 2026 12:17 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…

50 seconds ago

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

2 hours ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

2 hours ago

ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పొలిటికల్ స్కెచ్

తెలంగాణాలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చడంలో సఫలం అయిన…

2 hours ago

సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం: నాగార్జున

ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం తాము అదృష్టవంతులమని సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అన్నాడు. ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా…

3 hours ago

తన పార్టీ ఏదో చెప్పేసిన జగపతి

తెలుగు సినీ పరిశ్రమలో రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లు బోలెడంతమంది ఉన్నారు. వారిలో కొందరు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెడితే.. మిగతా…

4 hours ago