ముఖ్యమంత్రి చంద్రబాబుకు పని రాక్షసుడిగా పేరున్న విషయం తెలిసిందే. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసేవరకు వొదిలిపెట్టారని ఆయనను దగ్గరగా చూసిన అధికారులు చెబుతుంటారు. రాజకీయాలు కావొచ్చు, ఎన్నికలు కావొచ్చు, ప్రాజెక్టులు కావొచ్చు, సంక్షేమ పథకాల అమలు కావొచ్చు చెప్పింది చెప్పినట్టు చేయడం ఆయన స్టైల్. స్థానిక ఎన్నికల్లో కూడా అదే స్టైల్ ఫాలో అయ్యారు ఆయన. కూటమి పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు అని కాకుండా ఎవరికి ఎక్కడ బలముంది, ఎంత బలముంది అన్నదానికే ప్రాధాన్యత ఇచ్చారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. అయితే పట్టణ ఎన్నికల్లో అనంతపురంలో ఓటమిని ఆయన అంగీకరించలేక పోతున్నారు.
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడారు. అనంతపురంలో కూటమి ఓడిపోయే అవకాశమే లేదన్న ఆయన ఈ ఓటమిపై లోతుగా చర్చిస్తున్నట్లు తెలిపారు. అన్నీ కోణాల్లోను సమగ్రంగా సమీక్షిస్తామని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని పాటించని నాయకులను ఉపేక్షించేది లేదన్నారు.
నిజానికి అనంతపురంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. పటిష్టమైన లీడర్షిప్ కూడా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలంతా టీడీపీకి చెందిన వారే వున్నారు. ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే ప్రతినిద్యం వహిస్తున్నారు. బలం, బలగం ఉంచుకొని కూడా ఎన్నికల్లో ఓడిపోవడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఓటమికి కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అల్లూరి జిల్లాలో కూడా జడ్పీ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. గిరిజన ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఫలితాలు ఎందుకు వ్యతిరేకంగా వచ్చాయో పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. కుప్పంలో ఒక ఎంపీటీసీ స్థానంలో ఓడిపోయామని, వైసీపీ ఆరోపిస్తున్నట్లు అక్రమాలకు పాల్పడివుంటే అక్కడ వైసీపీ ఎలా గెలుస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం తెలుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగ పడ్డాయాని చెప్పారు.
This post was last modified on November 9, 2026 9:09 pm
ఈ మధ్య కలెక్షన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా కామెంట్లు అందుకున్న సినిమాల్లో సమ్మర్ హాలిడేస్ ఒకటి. చిన్న పిల్లలను…
నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…
కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…
మహిళా సెంటిమెంటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నది తెలిసిందే. అందునా.. రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన మహిళల విషయంలో మరింతగా…
"జగన్ ప్రజల ముందుకు వచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్రశ్న.…