ఈ మధ్య కలెక్షన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా కామెంట్లు అందుకున్న సినిమాల్లో సమ్మర్ హాలిడేస్ ఒకటి. చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని వాళ్ళతోనే తీసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ రాలేదు. నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రమోషన్ల విషయంలో బోలెడంత ఖర్చు పెట్టి, అంతా తానై ఈవెంట్ల నుంచి ఇంటర్వ్యూల దాకా అన్నీ చేశారు. మీడియా మద్దతు కూడా దక్కింది. విమర్శకులు సైతం గుడ్ ఫిలిం అని సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా సరే మార్పు లేదు. కారణం రామాయణ, సీన్ చూపిస్తున్న దూకుడు.
జనాలు తమిళ మలయాళ సినిమాలు ఎక్కువ చూసి మనవి ఆదరించడం లేదని, ఇలా అయితే నేను కూడా కమర్షియల్ దారిలోకి వెళ్లిపోతానని, అప్పుడు యంగ్ టాలెంట్స్ రావని ఒకరకంగా నిందిస్తున్న తరహాలో ధీరజ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు కన్నా ఎక్కువగా రివర్స్ కౌంటర్లు వచ్చాయి. ఏ మూవీకైనా టైమింగ్ చాలా ముఖ్యం. కాంపిటీషన్ ని తేలికగా తీసుకోకూడదు. కంటెంట్ బాగుంటే మనోళ్లకు డబ్బింగ్, స్ట్రెయిట్ అనే తేడా ఉండదని వీరభద్రుడు నుంచి సీన్ దాకా చాలా ఋజువు చేశాయి.
అలాంటప్పుడు సానుభూతిని సృష్టించడం ద్వారా జనాల అటెన్షన్ తీసుకోవాలనుకోవడం వర్కౌట్ అయ్యే పని కాదు. సమ్మర్ హాలిడేస్ నిజానికి వేసవి సెలవుల్లోనే వచ్చి ఉండాల్సింది. టైటిల్ కు న్యాయం జరగడంతో పాటు స్కూళ్ల బందు సమయంలో పిల్లలు, పెద్దలు దీని మీద ఒక లుక్ వేసేవారేమో. కేవలం ఒక రోజు సెలవు వచ్చే దీపావళిని ఎంచుకోవడం ఎంత లేదన్నా దెబ్బ కొట్టింది. అంతే తప్ప టాలీవుడ్ జనాలు బాగున్న కంటెంట్ ని తిరస్కరించిన దాఖలాలు ఎప్పుడూ లేవు.
వీకెండ్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ కు మరింత టఫ్ టైం మొదలయ్యింది. ఎందుకంటే శుక్రవారం మరో తొమ్మిది కొత్త రిలీజులు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. సో సెకండ్ వీకెండ్ కొనసాగడం అయ్యేపని కాదు. టికెట్ రేట్ల విషయంలో కూడా చిన్న సినిమాలు తమ స్ట్రాటజీ మార్చాలి. రామాయణ లాంటి గ్రాండియర్, సమ్మర్ హాలిడేస్ లాంటి చోటా మూవీ రెండూ ఒకటే రేట్ కి అందుబాటులో ఉన్నప్పుడు జనాల ప్రాధాన్యత దేని మీద ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా.
This post was last modified on November 9, 2026 8:59 pm
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పని రాక్షసుడిగా పేరున్న విషయం తెలిసిందే. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసేవరకు వొదిలిపెట్టారని ఆయనను…
నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…
కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…
మహిళా సెంటిమెంటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నది తెలిసిందే. అందునా.. రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన మహిళల విషయంలో మరింతగా…
"జగన్ ప్రజల ముందుకు వచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్రశ్న.…