“జగన్ ప్రజల ముందుకు వచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండేది”- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్రశ్న. ప్రతి ఇద్దరు నాయకుల మధ్య ఇదే తరహా చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి సీమ వరకు వైసీపీ మరోసారి తన పతనాన్నితానే చాటుకున్నట్టు అయిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారో… తేలిపోయింది. అయితే.. జగన్ ఈ కీలక ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే.. జగన్ మీడియా ముందుకు రాలేదా? అంటే వచ్చారు. కానీ.. ఆయన ప్రజలను తనవైపు తిప్పుకొనే విషయంలో తప్పటడుగులు వేశారని అంటున్నారు.
ఏం జరిగింది.. ?
ఇవి ఎన్నికలు కాదని, అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చేసుకున్న “ఎంపికలు” అని జగన్ ఆరోపించారు. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలు, రిగ్గింగ్, భయ బ్రాంతులకు గురిచేయడం జరిగిందని విమర్శించారు. జగన్, వైసీపీ నేతలు మరింత దూకుడుగా ప్రజల్లోకి వచ్చి ఉన్నప్పటికీ, అధికార బలంతో ఫలితాలను తారుమారు చేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తమకు పడిన ఓట్లు పార్టీకి ఇంకా బలముందని నిరూపిస్తున్నాయని, కూటమి ప్రభు త్వ వైఫల్యాలపై తాము ప్రజల హృదయాలను గెలుచుకున్నామని జగన్ పేర్కొన్నారు. కానీ, ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకే మెరుగైన ఫలితాలు వస్తాయని, 2021లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
జగన్ ప్రజల్లోకి వచ్చి ఉన్నా లేదా దూకుడుగా ప్రచారం చేసినా, 2024 సాధారణ ఎన్నికల తర్వాత కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ వంటి అంశాల వల్ల ఫలితాల్లో మార్పు ఉండేదని అభిప్రాయపడుతున్నారు. జగన్ క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్లనే పార్టీ శ్రేణుల్లో నైతికస్థైర్యం తగ్గిందని, ఆయన నేరుగా రంగంలోకి దిగి ఉంటే పోటీ కొంత గట్టిగా ఉండేదన్న అభిప్రాయం కూడాపార్టీ శ్రేణుల్లో ఉంది.
వీటికి తోడు.. షర్మిలతో వివాదం తమ కొంప ముంచిందని కూడా కొందరు చెబుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన సమయంలో జగన్.. దొరికిపోయారని, మేనకోడలు వివాహానికి ప్యాలెస్ ఇవ్వకపోవడం ద్వారా మహిళల విషయంలో జగన్ కు యాంటీ మార్కులు పడ్డాయని కొందరు చెబుతున్నారు.
ఎలా చూసుకున్నా… ప్రజల ముందుకు వచ్చి ఉంటే ఫలితం ఇంత దారుణంగా ఉండేది కాదని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 9, 2026 12:35 pm
కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…
మహిళా సెంటిమెంటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నది తెలిసిందే. అందునా.. రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన మహిళల విషయంలో మరింతగా…
పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…
దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…
కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…