Political News

జడ్పీ పీఠాలపై వారసుల కన్ను!

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయడంకా మోగించాయి. అయితే ఇప్పుడు ఆయా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఎవరికి దక్కనున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈసారి రాజకీయ వారసుల హవా ఎక్కువగా ఉంది. దాంతో పరిషత్ రాజకీయాలు మరింత రంజుగా మారాయి.

సీనియర్‌ నేత మజ్జి శ్రీను ఈ మధ్య వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. మొదట్నుంచి అనుకున్నట్టుగానే విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ రేసులో ఆయన కూతురు మజ్జి సిరి సహస్ర ముందంజలో వున్నారు. వారికి టీడీపీ అధినేత హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. సహస్ర తెర్లాం నుంచి జెడ్పీటీసీగా విజయంసాధించారు. అయితే ఆమె బీసీ కాదని వైసీపీ ఫిర్యాదు చేయడం ఇబ్బందిగా మారింది.

రాష్ట్రంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే తెలియని వారుండరు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆయన తన వారసురాలిని జడ్పీ గద్దెపై కూర్చోబెట్టెందుకు పావులు కదుపుతున్నారు. పెదవేగి జెడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమెకు ఏలూరు జడ్పి దక్కవచ్చని ప్రచారం జరుగుతుంది.

అనంతపురం జడ్పీ చైర్మన్ పదవి పరిటాల శ్రీరాంకు ఖరారైనట్టే అని చెబుతున్నారు. ధర్మవరం ఇంఛార్జ్ గా వున్న ఆయన నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు. కడప జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి తండ్రి నరసింహారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో అన్నీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు కుమారుడో, కూతురో పోటీ పడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యే తండ్రి రంగంలో ఉండటం విశేషం. నంద్యాల జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు రాజారెడ్డి పేరు వినిపిస్తుంది.

ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాల్లో ఎమ్మెల్యేల సోదరులకు ఛాన్స్ దక్కేలా వుందని ప్రచారం జరుగుతుంది. మార్కాపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో నారాయణరెడ్డి సోదరుడు రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జెడ్పీ ఛైర్మన్ రేసులో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సోదరుడు అనిల్ పేర్లు వినిపిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ పదవికి టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట్ పోటీ పడుతున్నట్టు చెబుతున్నారు. తిరుపతి జెడ్పీ ఛైర్‌పర్సన్‌ పదవికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్‌ చేతన కు ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత గట్టి పోటీ ఇస్తున్నట్లు సమాచారం.

మీడియాలో ఎవరి పేరు ప్రచారంలో వున్నప్పటికి ఫైనల్ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మాత్రమే అని చెప్పొచ్చు. జనసేన తరపున డీసీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్. అయితే సగానికి పైగా జడ్పీ చైర్మన్ పదవులు వారసులకు దక్కే అవకాశం ఉంది.

వారసత్వ రాజకీయాలకు టీడీపీ వ్యతిరేకం అయినప్పటికీ పార్టీ తరుపున నెక్స్ట్ జెనరేషన్ ను తయారు చేసుకునేందుకు తప్పదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో జెన్ జీకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

This post was last modified on November 9, 2026 12:16 pm

Share

Recent Posts

అర్జునుడి వెనుక ఇంత మంది పాండవులా

కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…

26 minutes ago

2024తో పోలిస్తే కూటమికి ఎంత లాభం? వైసీపీకి ఎంత నష్టం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…

43 minutes ago

చెల్లికి ద్రోహం… తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమా!

మ‌హిళా సెంటిమెంటు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందునా.. రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల విష‌యంలో మ‌రింత‌గా…

2 hours ago

జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. !

"జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.…

2 hours ago

నయనతారకిది ఊహించని అవమానమే

దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…

4 hours ago

500 కోట్ల రాజ్యంలో రఘురాముడి విహారం

కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…

4 hours ago