చెన్నైలో అంగరంగ వైభోగంగా జరిగిన వై ఎస్ అనిల్ కుమార్ రెడ్డి కూతురి వివాహం మరిచిపోక ముందే బీహార్లో ఓ ఎమ్మెల్యే కూతురి పెళ్లికి జరుగుతున్న ఏర్పాట్లపై మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే కూతురి పెళ్ళికి దేశంలోని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులే కాకుండా పొరుగు దేశాల నుంచి కూడా అతిధులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బీహార్‌లోని మొకామా నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనంత్ సింగ్ రాజ్ పార్టీకి చెందిన దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టయ్యారు. దాంతో ఆయన్ను జేడీయూ పార్టీ నుంచి బహిష్కరించింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద వున్నారు. ఈ నెల 25 వ తేదీన ఆయన కూతురు శివాంగి వివాహం జరగనుంది. ఈ పెళ్ళికి 4 లక్షల మందిని ఆహ్వానించారు. లడ్మా గ్రామంలో దాదాపు 10 నుండి 15 బిగాల విస్తీర్ణంలో భారీ పండల్‌ను ఏర్పాటు చేశారు. అతిధుల కోసం 150 కి పైగా వంటకాలతో భారీ విందును సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
భారీ విందుతో పాటుగా బీహార్ స్టైల్లో గుర్రపు పందాలు, కుస్తీ పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పందెంలో గెలిచిన విజేతకు మహీంద్రా థార్ ఎస్యూవి కారు, మోటారు బైకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాంతో బీహార్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు తరలి వెళుతున్నారు. ఇప్పటికే కొంతమంది కుస్తీ యోధులు లడ్మా గ్రామం చేరుకున్నారు. 15 రోజులకు ముందు నుంచే పాట్నా జిల్లాలో ఎటు చూసినా శివాంగి పెళ్లి సందడి కనిపిస్తుంది.
ఈ పెళ్ళికి దేశ విదేశాలనుండి పెద్ద సంఖ్యలో అతిధులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ వంటి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు బాలీవుడ్, భోజ్‌పురి సినీ ప్రముఖులను కూడా ఈ వివాహానికి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. వీరిలో అత్యధికులు హాజరయ్యే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లోని తన స్నేహితులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు అనంత్ సింగ్ తెలిపారు.
బీహార్‌లో అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా పేరుగాంచిన ఆయనను డాన్, బాహుబలి అని పిలుచుకుంటారు. ఆయనపై సుమారు 38 కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 సంవత్సరం నుండి వరుసగా 6 సార్లు మొకామా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు.
This post was last modified on November 9, 2026 9:20 am
మహిళా సెంటిమెంటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నది తెలిసిందే. అందునా.. రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన మహిళల విషయంలో మరింతగా…
"జగన్ ప్రజల ముందుకు వచ్చి ఉంటే.. స్థానిక ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్రశ్న.…
పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…
దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…
కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా గతంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.…