ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఈసీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అదే సమయంలో.. దాన్ని ససేమిరా అన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం. నోటిఫికేషన్ కు రోజు ముందు.. ఇద్దరు ఐఏఎస్.. ఒక ఐపీఎస్ అధికారితో పాటు పలువురు అధికారులపై బదిలీ వేటు వేస్తూ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కోపంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఇలాంటివేళ.. గతంలోనూ ఇలాంటి పరిస్థితే జగన్ తండ్రి దివంగత వైఎస్ కు ఎదురైన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆయన ఎలా రియాక్టు అయ్యారు. అప్పట్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవటం సుముచితమని చెప్పక తప్పదు.
అది 2006. వైఎస్ సీఎంగా ఉన్నారు. విశాఖ అసెంబ్లీకి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ఉన్నారు. అప్పటికే పోలింగ్ బూత్ అధికారుల జాబితాకు ఈసీ ఓకే చెప్పింది. అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్న వేళ.. కొన్ని ఫిర్యాదులు రావటంతో ప్రవీణ్ ప్రకాశ్.. ఆరోపణలు వచ్చిన అధికారుల్ని పోలింగ్ అధికారుల జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న ఈసీ సీరియస్ అయ్యింది. అప్పట్లో డిప్యూటీ కమిషనర్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ పిళ్లై కలెక్టర్ ప్రవీణ్ కు ఫోన్ చేశారు. ఈసీ ఆమోదం పొందాక జాబితాను మీకు తోచినట్లు మారచటం కుదరదని చెబితే.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఆయన ఈసీకి ప్రవీణ్ పై కంప్లైంట్ చేశారు. దీంతో.. ఆయన్నుఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ వేటు వేశారు. దీనిపై వైఎస్ సీరియస్ అయ్యారు. ఆయన్ను బదిలీ చేయాలన్న ఈసీ ఆదేశాన్ని అమలుచేయొద్దంటూ.. అంతా వారి ఇష్టమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం వైఎస్ కు కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ సన్నిహితుడిగా పేరుంది. దీంతో.. ఆయన్ను తొలగించాల్సిన అవసరం లేదన్న మాట వైఎస్ నోటి నుంచి వచ్చింది. దీనికి అప్పటి సీఎస్ స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నిక సంఘమే సుప్రీం అని.. వారితో ఘర్షణకు దిగితే రాష్ట్ర ప్రభుత్వానికే నష్టమని పేర్కొన్నారు. ‘ఘర్షణకు పోతే.. జాతీయ సమస్య అవుతుంది. కాస్త ఆలోచించండి’ అంటూ అనునయంగా చెప్పటంతో వైఎస్ వెనక్కి తగ్గి.. అయిష్ఠంగానే బదిలీ చేశారు.
2008లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. అప్పటి ప్రవీణ్ ప్రకాశ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోమన్ రెడ్డికి ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. వ్యవస్థల మధ్య పోరు కొన్నిసార్లు సిత్రంగా ఉంటుంది. ప్రజా ప్రభుత్వమే అయినా.. దానికి పరిమితి చట్రాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు. తాజా ఎపిసోడ్ లో జగన్ ఎలాంటి నిర్నయాలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on January 23, 2021 3:09 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…