విదేశీ నిధులు నిజమైతే షేక్ హ్యాండ్ ఎందుకిచ్చారు?

భారతీయ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ మధ్య విదేశీ నిధుల వివాదం దుమారం రేపుతూనే వుంది. నీట్ పేపర్ లికేజి వ్యవహారం, కొట్లాది మంది దేశ ప్రజల ఓట్ల అక్రమ తొలిగింపు మీద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ మీద ఎదురుదాడి మొదలుపెట్టింది. కాక్రోచ్ లకు అమెరికా, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది.

ఈ ఆరోపణలకు సీజేపీ నాయకులు ఘాటుగా సమాధానం ఇచ్చారు. యువ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక బీజేపీ ఇబ్బంది పడిపోతుంది. నిజంగా మాకు విదేశాల నుంచి నిధులు వస్తుంటే జంతర్ మంతర్ లో మాతో చర్చలు ఎందుకు జరిపారు? మాతో కలిసి చాయ్ ఎందుకు తాగారు? షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చారు? అంటూ వరస ప్రశ్నలతో సీజేపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆ అనుమానాలు ఎందుకు బయటకు చెప్పలేదని నిలదీశారు. దానికి బీజేపీ నాయకులు జవాబు ఇవ్వలేక నీళ్లు నమ్ములుతున్నారు.

కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం నుంచే తమ మీద బీజేపీ, రైట్ వింగ్ నాయకులు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, జూన్ 6న తొలి నిరసన చేపట్టకముందే తమ ఉద్యమంపై ప్రతికూల ప్రచారం మొదలుపెట్టారని సీజేపీ నాయకులు ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కాదా, మరి 4-5 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్ని ఎందుకు తీసుకురాలేక పోతున్నారన్న కాక్రోచ్ ల ప్రశ్నకు బీజేపీ నుంచి సమాధానం లేదు. పెయిడ్ ప్రచారాలు నడపడమే కాకుండా పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజల దృష్టి మరల్చే కుట్రలు చేస్తున్నారని కాక్రోచ్ లు చెబుతున్నారు.

కాక్రోచ్ పార్టీ ఆందోళనల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. నిరుద్యోగం, పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఓట్ల అక్రమాలు వంటి సమస్యలను సీజేపీ ప్రస్థావిస్తుండటంతో ప్రజలు కూడా గొంతు కలుపుతున్నారు. దీంతో బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. సీజేపీ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు

విదేశీ నిధుల అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తునరని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఆత్మరక్షణలో భాగంగా చేస్తున్నవేనని చెబుతున్నారు.