వైసీపీ హయాంలో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై చెవిరెడ్డి హత్యా ప్రయత్నం కూడా చేశారని ఆరోపణలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు పులివర్తి నానితో పాటు ఆయన కుటుంబాన్ని చెవిరెడ్డి, ఆయన అనుచరులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డిని పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘‘ఇవాళంతా నేను అన్నతోనే ఉంటా…అన్న ఎక్కడికి వెళితే అక్కడికి కారులో ఫాలో అవుతా…అన్నకు కుర్చీ వేయండి..నాకు కూడా ఓ కుర్చీ వేయండి..ఇక్కడే కూర్చొని అన్నతో కలిసి టీ తాగుతా… నా భర్తను చంపాలని చూసినా సరే నేను ప్రశాంతంగా అన్నతో కూర్చొని మాట్లాడుతున్నా’’ అంటూ సుధారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక చెవిరెడ్డి చేష్టలుడిగారు.
‘‘2029లో కదా..కిరీటాలు పెడతారా ఇప్పుడు ..అప్పుడు చూసుకుందాం..అంటూ వార్నింగ్ ఇచ్చారు సుధారెడ్డి. అన్నా నాన్ సెన్స్ చేయొద్దన్నా…ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయండి… ఒక్క వీడియో బయటకు పోతే..మీకూ నాకు డైరెక్ట్ యుద్ధం జరుగుతది’’…అంటూ డైరెక్ట్ గా చెవిరెడ్డి ముందు నిల్చొని సుధారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చిన వైనం టీడీపీ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పించింది.
అన్న ముందు కూర్చోలేను.. కూర్చుంటే గర్వం అనుకుంటారు..అదీ కాకుండా నా కాలు విరిచేసినారు కదా నొప్పి ఉంది……అంటూ చెవిరెడ్డిని ర్యాగింగ్ చేశారు. గలాటా చేయొద్దని, లేని కొట్లాటలు చూపించి, వీడియోలు తీసి..పోలీసులకు శాపనార్థాలు పెట్టవద్దని సుధారెడ్డి హెచ్చరించారు. అన్నకు ఫోన్ వచ్చింది..ఫోన్ మాట్లాడనివ్వండి..అంటూ…చెవిరెడ్డిని ఓ రేంజ్ లో సుధారెడ్డి ఆడుకున్నారు.
ఇక తన అన్న చెవిరెడ్డిపై ఈగ వాలనివ్వకుండా తాను చూసుకుంటానని, అదే తన డ్యూటీ అని, పోలీసులు ప్రశాంతంగా ఎన్నికల భద్రత డ్యూటీ చూసుకోవచ్చని కూడా సుధారెడ్డి చెప్పారు. మూడు రోజుల పాటు ట్రాప్ చేసి పోలీసులను నిందించేలా చెవిరెడ్డి చేశారని, నాలుగు తరాలు….అంటూ పోలీసులకు శాపాలు పెట్టారుని, అలా పెట్టేందుకు నోరెట్లా వస్తుంది….అని ఆమె ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates