Political News

జగన్ కు ఎవరైనా చెబితే బాగుండు

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ కు ఆ పార్టీ కార్యకర్తల్లో హీరో ఇమేజ్ ఉండడంలో తప్పు లేదు. జగన్ కు యువతలో కల్ట్ ఫ్యాన్స్, డై హార్డ్ అభిమానులు కూడా ఉన్నారు. ఇటువంటి ఇమేజ్ ఉన్న నాయకుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు అంటే సహజంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూడాలి.

జగన్ ఏం చెబుతారు….కూటమి పార్టీలకు ఎటువంటి కౌంటర్ ఇస్తారు…అవతలి పార్టీల నేతలను ఎటువంటి కామెంట్లతో ఇరకాటంలో పడేస్తారు..అని వారు ఆశించడం సహజం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. జగన్ మీడియా ముందుకు వస్తున్నారంటే చాలు వారంతా హడలిపోతున్నారు. జగన్ టంగ్ స్లిప్ అయి ఏం మాట్లాడతారో? ఈ సారి ట్రోలర్స్ కు ఎంత స్టఫ్ ఇస్తారో? ఈ సారి చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారో? బ్లండర్స్ ఎన్ని ఉంటాయో? అంటూ వారంతా కంగారు పడుతున్నారు. వారి కంగారుకు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా జగన్ తన ఒక్కో ప్రెస్ మీట్ ఒక్కో ఆణిముత్యం అన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

రాప్తాడు ఘటనలో బాధిత బాలికను పరామర్శించిన తర్వాత జగన్ చేసిన కొన్ని కామెంట్లు చూసి వైసీపీ లీడర్లు, క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు.‘‘చావు బతుకుల్లో ఉన్న ఆ చిన్నారి చిన్నాన్న వైసీపీ మండల కన్వీనియర్’’ అంటూ జగన్ చేసిన కామెంట్లను యథావిధిగా కూటమి పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. కాదు కాదు..అలా ట్రోల్ చేసే ఛాన్స్ జగన్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేయలేక…అలా అని జగన్ కు లేదా జగన్ కు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి చెప్పలేక సతమతమవుతున్నారు. జగన్ స్పీచ్ లే ట్రోలర్స్ కు శ్రీరామ రక్ష అన్నరీతిలో పరిస్థితి ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన గురించి ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? పోనీ అక్కడ ఏమైనా గణాంకాలు గట్రా చెప్పాలా? అంటే అదీ లేదు. మరి ఎందుకు జగన్ టెన్షన్ పడుతున్నారు? పోనీ మీడియా ప్రతినిధులు ఏమైనా ఇరకాటంలో పడేసే ప్రశ్నలు అడిగితే తడబడ్డారు అనుకోవచ్చు. కానీ, తన స్పీచ్ సందర్భంగానే జగన్ ఇలా లూప్ లో మాట్లాడుతూ అడ్డంగా బుక్కయి వైసీపీ కార్యకర్తలను టెన్షన్ పెడుతున్నారు.

ఇక, బాధిత బాలిక చిన్నాన్న వైసీపీ నేత కాబట్టే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఈ దాడి జరిగిందని అర్థం వచ్చేలా కూడా జగన్ మాట్లాడిన వైనం విమర్శల పాలైంది. ఈ ఘటన పార్టీలకు అతీతంగా జరిగింది అన్న విషయం అందరికీ తెలుసు. ఇది ఒక ఉన్మాది చేసిన ఘాతుకం. పార్టీలకతీతంగా అందరూ ఖండించాలి. కానీ, మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఈ ఘటనను పార్టీకి లింక్ పెట్టడం ఆయన అపరిపక్వతకు నిదర్శనం.

ఇక, అదే సమయంలో నిన్న బాధిత బాలికను పరామర్శించిన లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనాన్ని పెంచేలా ఉన్నాయి. ఈ ఘటనను రాజకీయం చేయడం లేదని, బాధిత బాలికకు అన్నలా అండగా నిలబడతానని, వారి కుటుంబాన్ని ఆదుకోవడం తమ ప్రభుత్వ బాధ్యత అని లోకేశ్ చెప్పారు. లోకేశ్, జగన్ లకు ఉన్న తేడా ఇది.

అయితే, జగన్ ఇలా టంగ్ స్లిప్ కావడం…తొలిసారి కాదు. డీఎస్సీ స్కాం అంటూ ప్రెస్ మీట్ పెట్టిన జగన్…ఏపీపీఎస్సీ….డీఎస్సీ…ఒకటే కదా అంటూ మీడియా ముందు మాట్లాడి ట్రోల్ మెటీరియల్ అయిన సంగతి తెలిసిందే. సహజంగా ఓసీడీ ఉన్నవాళ్లు ఇలా చేస్తుంటారు. ఇంటికి తాళం స్వయంగా వేసినా సరే…తాళం పడిందో లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తుంటారు. అదే మాదిరిగా జగన్ చెప్పిందే ఒకటికి రెండు మూడు సార్లు చెప్పడం వల్ల ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధుల సహనానికి అగ్ని పరీక్ష పెడుతున్నట్లవుతోంది.

ఇలా రిపీట్ మోడ్ లో జగన్ డైలాగులు చెప్పడం వల్ల గంట జరగాల్సిన ప్రెస్ మీట్ కు 2 గంటలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది తటస్థ పాడ్ కాస్టర్లు కూడా జగన్ సుదీర్ఘ సువివర ప్రెస్ మీట్లరె సహేతుకంగా విమర్శించారు కూడా. పేపర్ చూసి స్క్రిప్ట్ చదివే సమయంలో కూడా జగన్ ఇలా చేస్తున్నారు. ఇక, పబ్లిక్ ప్లేసుల్లో జగన్ ప్రెస్ మీట్ లు పెడితే దబిడి దిబిడే.

అయితే, జగన్ స్వభావం తెలిసిన వారు ఆయనకు ప్రెస్ మీట్ల లెంగ్త్ పై, టంగ్ స్లిప్ లపై, చెప్పిందే చెప్పడం వంటి విషయాలపై సలహాలు ఇచ్చే ఛాన్స్ లు చాలా అరుదు. ఎవరు చెప్పినా వినని జగన్ కు ఎవరైనా చెబితే బాగుండు అని అనుకునే వైసీపీ నేతలు, కార్యకర్తలు చాలామందే ఉన్నారు. పొరపాటున టంగ్ స్లిప్ కావడం..చెప్పిందే చెప్పడం అనేది ఏ నేతకైనా సహజం. కానీ, ఆ పొరపాటు అలవాటుగా మారినప్పుడే ఇబ్బంది.

జగన్ స్టామర్ అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. అలా అయితే, ఆ ఇష్యూపై ఆయన ఫోకస్ చేసి దానిని సరిదిద్దుకోవడం మంచిది. ఒక తెలుగు వెబ్ సిరీస్ లో యువకుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు కూడా స్పీచ్ ల విషయంలో ఇబ్బంది పడ్డారు అని చూపించారు. అయితే, ఆ తర్వాత ఆయన దానిని అధిగమించి ఇప్పుడు అనర్గళంగా ప్రసంగిస్తున్నారు.

భవిష్యత్తులో తన లోపాలను గుర్తించి వాటిని జగన్ సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. ఒకవేళ మారకుంటే..మారాలి అనుకోకుంటే సీరియస్ గా మాజీ సీఎం రేంజ్ లో సీరియస్ గా జగన్ చెప్పిన విషయాలు కూడా సిల్లీగా మిగిలిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు!

This post was last modified on November 3, 2026 9:37 am

Share

Recent Posts

మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర…

21 minutes ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

10 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

11 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

11 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

11 hours ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

11 hours ago