Political News

రేవంత్ రెడ్డి వానర సైన్యం

ప్ర‌ధాని మోడీ మెడ‌లు వంచుతామ‌ని.. ఆయ‌న‌ను గ‌ద్దె నుంచి దింపుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చేప‌ట్టిన భారీ నిర‌స‌న‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంపైనా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్‌కుమార్‌పైనా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ఓట్ల‌ను తొల‌గించి.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

దేశంలో ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లకు ఎసరు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మోడీని గద్దె దించేందుకే ఈ పోరాటం కొన‌సాగుతుంద‌ని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వాన‌ర సైన్యంతో పోల్చారు. “నా వానర సైన్యంతో గర్జిస్తా.. మోడీ తలవంచక తప్పదు, మోడీ మెడలు వంచుతాం” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎన్నిక‌ల సంఘం తీరును తప్పుపడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాడు లంకా ద‌హ‌నానికి వాన‌ర సైన్యం వ‌చ్చిన‌ట్టుగా ఇప్పుడు మేమంతా వ‌చ్చామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. మోడీ కుర్చీని కాపాడేందుకు.. మ‌రో 20 కోట్ల‌మంది పేద‌ల ఓట్ల‌ను తొల‌గించేందుకు జ్ఞానేష్ కుమార్ కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. మ‌హారాష్ట్ర‌, బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌లో పేద‌ల ఓట్లు తొల‌గించి.. త‌మ ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని ఎక్కువ కాలం సాగ‌నివ్వ‌బోమ‌ని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో భారీ భ‌ద్ర‌త‌..

కాంగ్రెస్ నిర‌స‌న నేప‌థ్యంలో పోలీసులు ఢిల్లీని అష్ట‌దిగ్భంధం చేశారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో మెట్రో స‌హా ప్ర‌జారవాణాపై ఎలాంటి నిర్బంధాలు విధించ‌క‌పోయినా.. ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న కారుల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దాదాపు న‌గ‌రం మొత్తం ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా పోలీసుల‌ను తీసుకువ‌చ్చార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా 10 వేల మందికిపైగా పోలీసుల‌ను మోహ‌రించారు.

This post was last modified on November 2, 2026 7:53 am

Share

Recent Posts

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…!

పులివెందుల‌లో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల పోలింగ్‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ప‌రాభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆయ‌న అడుగు పెట్టీ పెట్ట‌డంతోనే…

44 minutes ago

కిరాతకుడు హేమంత్ పై కాల్పులు – సంబరాల్లో ప్రజలు

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…

1 hour ago

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

9 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

10 hours ago

జ‌గ‌న్ ఆశ తీరుతుందా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులి వెందుల‌లో ఆదివారం హ‌ల్చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.…

10 hours ago

తమన్ గమనిస్తున్నాడా?

తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు తమన్. వేరే భాషల్లోనూ తరచుగా సినిమాలు చేస్తున్నాడు. తన…

10 hours ago