Political News

ఆర్నబ్ తుఫానును బాబు ఎలా ఎదుర్కున్నారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆర్న‌బ్ తుఫాను ఎఫెక్ట్ వేళ 32 వేల మందితో టెలీ కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించి స‌రికొత్త రికార్డు ను న‌మోదు చేశారు. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉండ‌డంతో అన్ని శాఖల అధికారుల‌తోనూ నిరంత‌రాయంగా ఆయ న ట‌చ్‌లో ఉన్నారు. ఒకే సారి 32 వేల మంది అధికారుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌డంతోపాటు.. వారి ప‌నితీరును తెలుసుకున్నారు. తాను త‌గు సూచ‌న‌లు ఇస్తూనే స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని దానికి త‌గిన విధంగా ముందుకు సాగాల‌ని దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర జిల్లాలు స‌హా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను తెలుసుకున్న చంద్ర‌బాబు.. ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్ర‌భావానికి గురైన వారికి అన్ని విధాలా అండ‌గా ఉండాల‌ని సూచించారు. గ‌త 36 గంటలుగా నిర్విరామంగా సేవ‌లు చేస్తున్న అధికారులు.. అదే స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని సీఎం సూచించారు. ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ నేప‌థ్యంలో వాటిని అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు పంట‌, ఇత‌ర న‌ష్టాల‌ను కూడా చంద్ర‌బాబుకు వివ‌రించారు.

కేంద్రానికి లేఖ

మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా చంద్ర‌బాబు తాజాగా లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఆర్న‌బ్ తుఫాను నేప‌థ్యంలో విపత్తు సంభ‌వించిన ప్రాంతాల్లో సాయం చేసేందుకు కేంద్ర బ‌ల‌గాల‌ను త‌క్ష‌ణ‌మే పంపించాల‌ని కోరారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు చంద్ర‌బాబు లేఖ పంపించారు. క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది కొర‌త లేక‌పోయినా.. మ‌రింత మందిని ఆదుకునేందుకు కేంద్రం నుంచి బ‌ల‌గాల‌ను పంపించాల‌ని సూచించారు. అలానే ఎన్‌డీఆర్ ఎఫ్ బృందాల‌ను కూడా పంపాల‌ని కోరారు.

ఆహారం.. నీరు..

విప‌త్తు కార‌ణంగా పున‌రావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు. ఇప్ప‌టికే త‌గు చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుగా నిధుల‌ను మంజూరు చేశామ‌ని.. వాటిని ఖ‌ర్చు చేయాల‌నిపేర్కొన్నారు. ఆహారం, తాగునీరు, అవ‌స‌ర‌మైన మందుల‌ను అందుబాటులో ఉంచాల‌న్నా రు. ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌య స్ఫూర్తిగా వ్య‌వ‌హ‌రించి ప‌నిచేయాల‌ని ఆదేశించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే వారిని ఉపేక్షించేది లేద‌న్నారు.

This post was last modified on October 29, 2026 11:25 am

Share

Recent Posts

ఆదర్శం మీద అందరి కళ్ళు

సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…

24 minutes ago

అనవసరపు రాద్ధాంతం ఇప్పుడు ఎందుకు

సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా…

59 minutes ago

ఇకపై లంచం అడిగితే జైలే

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్,…

1 hour ago

విభజన ప్రేమకథతో శ్రీకాంత్ ఓదెల సినిమా

దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర…

5 hours ago

ఆదుకుంటాం… ఏపీకి తెలంగాణ ఆప‌న్న‌హ‌స్తం!

ఏపీ తుపాను సహాయక చర్యలలో సాయం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. విద్యుత్‌ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధమైంది.…

5 hours ago

అసూయ పుట్టిస్తున్న అబ్బవరం

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించడం చిన్న విషయం కాదు. సక్సెస్ రేట్ చాలా…

8 hours ago