ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించడం చిన్న విషయం కాదు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే ఈ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అన్నవి ఊరికే వచ్చేయవు. మంచి జడ్జిమెంట్ ఉండాలి. సరైన సినిమాలు చేయాలి. నిలకడగా విజయాలు అందుకుని, ప్రేక్షకుల నమ్మకం సంపాదించాలి. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఇలాంటి నమ్మకమే సంపాదించాడు.
మధ్యలో అతను కూడా కొన్ని తప్పటడుగులు వేశాడు కానీ.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ మధ్య వరుసగా హిట్లు కొడుతున్నాడు. తన చివరి చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి తన రేంజి పెంచింది. ఇప్పుడు కిరణ్ నుంచి ‘రియాలిటీ’ సినిమా రాబోతోంది. ఆ చిత్రానికి దర్శకుడు కూడా అబ్బవరమే. క్రిస్మస్ సీజన్లో కింగ్ 100, దాదా, కింగ్ లాంటి భారీ చిత్రాలు బరిలో ఉన్నా సరే.. తన సినిమాను కూడా పోటీలో నిలబెట్టాడు కిరణ్. అయినా ఈ సినిమాకు ట్రేడ్‌లో మంచి డిమాండ్ ఉండడం విశేషమే.
‘రియాలిటీ’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.16 కోట్లకు అమ్మారట నిర్మాత. హక్కుల కోసం నలుగురు డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారట. చివరికి నిర్మాత చెప్పిన రేటుకే ఒక డిస్ట్రిబ్యూటర్ హక్కులు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘చెన్నై లవ్ స్టోరీ’కి కాంబినేషన్ క్రేజ్ ఉంది. సాయిరాజేష్, ఎస్కేఎన్ బ్రాండు ఉపయోగపడింది. ఆ సినిమా బడ్జెట్, కాస్టింగ్ అంతా వేరు. కానీ ‘రియాలిటీ’కి అన్నీ కిరణే. తన ముఖం చూసే ప్రేక్షకులు సినిమాకు రావాలి. తన పేరు మీదే బిజినెస్ కూడా అయింది. ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను మంచి రేటుకు అమ్మారు. ఇప్పుడు రిలీజ్‌కు రెండు నెలల ముందే థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయింది.
మంచి అభిరుచితో ‘భజగోవిందం’ పాట చేయించుకుని, ఆ పాటను చక్కగా చిత్రీకరించడం ద్వారా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లిపోయాడు కిరణ్.
ఈ పాట బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి అందాలకు సంబంధించి ఒక వీడియో చేస్తే దాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు షేర్ చేయడం విశేషం. దీన్ని బట్టే పాట ఎంతగా పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. మిడ్ రేంజ్ హీరోల్లో కిరణ్ స్థాయిలో బిజినెస్ అవుతున్న హీరోలు చాలా కొద్దిమందనే. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇలాంటి బ్రాండ్ వాల్యూ సంపాదించిన కిరణ్‌ను చూసి యంగ్ హీరోలు అసూయ పడుతుంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on October 29, 2026 12:05 am
దక్షిణాదిన కొన్ని సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌కు పరిమితం అవుతుంటారు కొందరు హీరోయిన్లు. బాలీవుడ్లో కెరీర్ పుంజుకున్నాక.. మళ్లీ…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన…
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…
ఒకే ఏడాదిలో మూడు థియేటర్ రిలీజులిస్తున్న స్టార్ హీరోగా సూర్య 2026లో పెద్ద ఘనతనే అందుకోబోతున్నాడు. కరుప్పు / వీరభద్రుడుతో…