ఏపీ తుపాను సహాయక చర్యలలో సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. విద్యుత్ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోన్ చేసి.. సాయం అందించనున్నట్టు వివరించారు. ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఏపీలో జరిగిన నష్టం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు బుధవారం ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు.
తుపాను కారణంగా ఇప్పటివరకు జరిగిన నష్టం, ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చేపట్టిన చర్యలను మంత్రి గొట్టిపాటి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నష్ట నివారణ, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సరిచేస్తూ, సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని భట్టి భరోసా ఇచ్చారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామన్నారు. సిబ్బంది నుంచి విద్యుత్ పరమైన మౌలిక సదుపాయాల వరకు సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అయిందని వివరించారు. కాగా, కష్టకాలంలో ఏపీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడాన్ని అభినందించారు.
This post was last modified on October 29, 2026 11:21 am
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…
సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా…
అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్,…
దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర…
ఏపీ సీఎం చంద్రబాబు ఆర్నబ్ తుఫాను ఎఫెక్ట్ వేళ 32 వేల మందితో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి సరికొత్త రికార్డు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించడం చిన్న విషయం కాదు. సక్సెస్ రేట్ చాలా…