దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర మాస్ పాత్రలో ప్రెజెంట్ చేసిన తీరు వంద కోట్ల వసూళ్లను తెచ్చి పెట్టింది. ఆ నమ్మకమే నానిని ఎక్కువ కమర్షియల్ సినిమాల వైపు డైవర్ట్ అయ్యేలా చేసింది. అయితే దసరాని మించిన బొమ్మ ఇస్తాడనే భరోసాతో గుడ్డిగా నీ ఇష్టం శ్రీకాంత్ అన్నందుకు మాత్రం ప్యారడైజ్ రూపంలో పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నానితో పాటు ఓదెల కూడా ట్రోలింగ్ బారిన పడటం ట్రాజెడీ.
ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం 2014 తెలంగాణ విభజన బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రేమకథని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇది కూడా ఇంటెన్స్ డ్రామాగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. పార్టీషన్ సమయంలో ఎన్ని అల్లర్లు, గొడవలు, ప్రాణ త్యాగాలు జరిగాయో తెలిసిందే. బయట ప్రపంచానికి తెలియని సంఘటనలు ఎన్నో జరిగాయి. వాటి బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా అంచనాలు పెట్టుకోవచ్చు. కాకపోతే వయొలెన్స్ ఏ మోతాదులో ఉంటుందో చూడాలి.
హీరో హీరోయిన్ తదితర ఎంపికలేవి జరగలేదట. ముందు స్క్రిప్ట్ సిద్ధమయ్యాక అప్పుడు వేట మొదలుపెడతారట. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఫేస్ చేస్తున్న అతి పెద్ద బాధ చిరంజీవితో చేయాల్సిన సినిమా నిరవధికంగా వాయిదా పడటం. తన ఐకాన్ ని ఎలా చూపిస్తానో మీ ఊహకు అందదంటూ అప్పట్లో ఊరించిన శ్రీకాంత్ ఇప్పుడా ప్రాజెక్టు ఉంటుందో లేదో అని అనుమానపడే స్టేజికి తెచ్చుకున్నారు. సో ఇంకో సినిమాతో కంబ్యాక్ అయితే మెగాస్టార్ నుంచి పిలుపు రావొచ్చేమో.
ఇంతకు మించి ప్రస్తుతానికి వివరాలు లేవు. ఇదంతా ఓకే కానీ సోషల్ మీడియాలో ప్యారడైజ్ ట్రోల్స్ ప్రహసనం ఓటిటి వచ్చాక మరింత ఎక్కువయ్యాయి. మానిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్టు వీడియోలు తీసుకొచ్చి మరీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారనేది పక్కనపెడితే ఇకపై దర్శకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకునేందుకు హెచ్చరికగా ఉపయోగపడుతోంది. దసరాని భుజాన మోసినవాళ్ళే ఇప్పుడు ప్యారడైజ్ ని దుమ్మెత్తిపోస్తున్నారని మర్చిపోకూడదు.
This post was last modified on October 29, 2026 12:37 am
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినీ రంగంలో స్టార్ ఇమేజ్ సంపాదించడం చిన్న విషయం కాదు. సక్సెస్ రేట్ చాలా…
దక్షిణాదిన కొన్ని సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్‌కు పరిమితం అవుతుంటారు కొందరు హీరోయిన్లు. బాలీవుడ్లో కెరీర్ పుంజుకున్నాక.. మళ్లీ…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమాతో సంచలనం రేపాడు యువ నటుడు మౌళి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రయాణం మొదలుపెట్టిన…
తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని చాలా ఏళ్ల కిందట్నుంచే చెబుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఆ సినిమా…
ఔను... పులివెందులలో జగన్ కు కొత్త సినిమా చూపిస్తామంటున్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. ఒకప్పుడు జగన్ కోసం ప్రాణాలు…
తెలంగాణలో పోటీ చేసి తీరుతామని ప్రకటించిన జనసేన.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టిందా? రంగంలోకి దిగేందుకురెడీ అయిందా? అంటే…