ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని వైసీపీ ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి అన్న తర్వాత 3 పార్టీలకు చెందిన కింది స్థాయి నాయకుల మధ్యం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయన్నది వాస్తవం. కానీ, ఆ చిన్న చిన్న ఇష్యూస్ ని వైసీపీ భూతద్దంలో చూపించి విష ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారానికి తెర దించుతూ కూటమిలోని మూడు పార్టీల అధ్యక్షులు ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే జనసైనికులకు, నేతలకు జనసేనాని పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల అన్ని పార్టీలకు, రాష్ట్రాభివృద్ధికి చాలా కీలకం అని పవన్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు చూపిన ఉత్సాహం, ఐక్యత ఇప్పుడు కూడా చూపించాలని పవన్ పిలుపునిచ్చారు. నాయకత్వ స్థాయిలో తాము ఎన్నో చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, కింద స్థాయిలో కూడా అదే ఐక్యత చూపించాలని జనసేన నాయకులు, పోటీదారులు, మద్దతుదారులను కోరారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గారిని మరింత దగ్గర నుంచి చూశానని పవన్ చెప్పారు. కొద్ది రోజులుగా సీట్ల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడ్డామని అన్నారు. 2024లో తేలికగా సీట్ల సర్దుబాటు చేశామని, కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానాల సంఖ్య, అన్ని పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. టీడీపీకి 40 ఏళ్ల అనుభవం ఉందని, బీజేపీకి సంస్థాగత అనుభవం ఉందని, జనసేన పదేళ్లుగా బలపడిందని చెప్పారు. ప్రతి ఒక్క పార్టీకి తమ పార్టీకి సీట్లు పెరగాలి అని ఉండడం సహజమని అన్నారు.
అయితే, సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని సర్ది చెప్పడం, సర్దుకోవడం, నచ్చజెప్పడం చేశారని, అందరం కలిసి ఏకాబిప్రాయానికి వచ్చి ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. జనసేన నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులు కూడా కూటమి హై కమాండ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నిర్దేశించిన స్థానాల్లోనే పోటీ చేయాలని, మిగతా పార్టీల అభ్యర్థులకు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 27, 2026 12:09 pm
బాలీవుడ్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగులో ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది…
ఒక హీరో, ఒక నిర్మాత కలిసి సినిమా చేసే క్రమంలో కొన్ని నెలలు, సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తారు. ఈ…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి బుల్లితెరపై మెరవబోతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా ఒక సీజన్ నడిపించిన సంగతి…
ప్యాన్ ఇండియా సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. రిస్క్ తీసుకుని ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసిన దాఖలాలు…
తమిళ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ఇటీవల విపరీతంగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన సొంతంగా రాజకీయ పార్టీ…
ఈ వారం అక్టోబర్ 30 విడుదల కాబోయే కల్ట్ కి ఎలాంటి ముందు రోజు ప్రీమియర్లు ఉండవని విశ్వక్ సేన్…