Political News

ఏబీవీకి మంచి మద్దతు

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంక‌టే శ్వర‌రావు(ఏబీవీ)కు మాజీ ఐపీఎస్‌, పోలీసు అధికారుల సంఘం దాదాపు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఏబీవీ.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ స‌హా.. ఇత‌ర చిన్నా చిత‌క పార్టీలు మద్ద‌తు ప్ర‌క‌టించారు. ఒక‌వైపు ఆయ‌న ప్ర‌చారం కూడా జోరుగా సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన‌.. రిటైర్డ్ పోలీసు అధికారులు, మాజీ ఐపీఎస్‌ అధికారుల సంఘాల ప్రతినిధులు ఏబీవీకి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

రాజ‌కీయాల్లో హుందా త‌నానికి ఏబీవీ పెద్ద పీట వేస్తున్నార‌ని ప్ర‌తినిధులు పేర్కొన్నారు. త‌న‌ ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణను ఏబీవీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం రాజకీయ విభేదాలకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య ఉండాల్సిన హుందాతనానికి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఏబీ వెంకటేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంద‌ని, పలువురికి ఆయన వృత్తిపరమైన నిబద్ధత. క్రమశిక్షణ, సిబ్బంది పట్ల వ్యవహరించే తీరు గురించి ప్రత్యక్ష అవగాహన ఉందని పేర్కొన్నారు.

తన కింద పనిచేసే సిబ్బంది తెలిసో తెలియకో పొరపాట్లు చేసిన సందర్భాల్లో, వాటి తీవ్రతను బట్టి వ్యవహరిస్తూనే, వారి కుటుంబాలపై పడే ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకునేవారని తెలిపారు. సాధ్యమైన సందర్భాల్లో కఠినమైన క్రమశిక్షణ చర్యలకు బదులుగా మందలించి, తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించేవారని పేర్కొన్నారు. అటువంటి అధికారి గురించి ఇటీవల ఒక పోలీసు అధికారి సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన ఆరోపణలను తీవ్రంగా బండిస్తున్నట్టు తెలిపారు.  

ఈ ఆరోపణల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయన్నారు. వాటి నిజాని జాలు తేలాల్సి ఉందన్నారు. అయితే, ఎన్నికల సమయంలో వ్యక్తిగత ఆరోపణలకు కులపరమైన ప్రస్తావనలను జోడించడం బాధ్యతాయుతమైన చర్య కాదని సంఘం ప్ర‌తినిధులు వ్యాఖ్యానించారు. రిటైర్డ్ పోలీసు అధికారులుగా ఏబీవీకి సానుకూల‌త వ్య‌క్తం చేయ‌డం త‌ప్పుకాద‌ని వ్యాఖ్యానించారు. త‌ద్వారాఏబీవీకి ప‌రోక్షంగా వారు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. 

This post was last modified on October 27, 2026 1:25 pm

Share

Recent Posts

పాపం చంద్రబాబు చాలా తగ్గారు: పవన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని వైసీపీ ప్రచారం…

1 hour ago

కంగనా రనౌత్ మళ్లీ తెలుగులో?

బాలీవుడ్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగులో ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది…

2 hours ago

నాగ‌వంశీ ఫ్రెండు కాదు, ప్రొడ్యూసర్ మాత్రమే

ఒక హీరో, ఒక‌ నిర్మాత క‌లిసి సినిమా చేసే క్ర‌మంలో కొన్ని నెల‌లు, సంవ‌త్స‌రాలు క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఈ…

3 hours ago

మెగావర్స్… కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బుల్లితెరపై మెరవబోతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా ఒక సీజన్ నడిపించిన సంగతి…

3 hours ago

టికెట్ రేట్ల ఆదర్శం మేలు చేస్తుందంటారా

ప్యాన్ ఇండియా సినిమా కాదు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు. రిస్క్ తీసుకుని ఫారిన్ లొకేషన్లలో షూట్ చేసిన దాఖలాలు…

4 hours ago

ధనుష్ పార్టీ వెనక బీజేపీ వుందా?

తమిళ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు ఇటీవల విపరీతంగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన సొంతంగా రాజకీయ పార్టీ…

4 hours ago