ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా సౌండ్ డిజైన్, బీజీఎమ్, బ్యాక్ డ్రాప్, కొన్ని థ్రిల్స్ గురించి సోషల్ మీడియాలో కాసింత సౌండ్ వినిపించడంతో మెయిన్ సెంటర్స్ లో థియేటర్లు బాగానే నిండుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ డామినేట్ చేస్తున్న సినిమాల్లో జైలర్ 2, రణబాలి తర్వాత ఇప్పుడు 418 ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉన్నప్పటికీ వసూళ్లు స్టడీగా ఉండటం గమనార్హం.
భయపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో దేవికగా నటించిన చైత్ర జె ఆచార్ పెర్ఫార్మన్స్ గురించి అధిక శాతం మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే తన వల్లే ఆ ఎపిసోడ్ నిలబడింది. పిల్లలు లేక మానసిక రుగ్మతకు లోనై దారుణాలు చేసేందుకు వెనుకాడని పాత్రలో ఇంటెన్స్ నటన చూపించింది. ఒకరకంగా సెకండాఫ్ నిలబెట్టింది తనే. అందుకే స్పెషల్ గా చెప్పుకున్నారు. ఇంకాస్త నిడివి ఉన్నా బాగుండేదేమో.
ఇదిలా ఉండగా చైత్ర జె ఆచార్ మన ప్రభాస్ ఫౌజీలో ఒక కీలక పాత్ర చేస్తోందని టాక్. టీమ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ క్యాస్టింగ్ లో తను ఉన్నట్టు సమాచారం. ఇమాన్వి హీరోయిన్ అయినప్పటికీ కథలో చాలా ముఖ్యమైన మలుపుకు దారి తీసే క్యారెక్టర్ చైత్రకు ఇచ్చారని తెలిసింది. తను మనకు కొత్త కాదు. సప్తసాగరాలు దాటి సైడ్ బిలో రుక్మిణి వసంత్ తో పాటు హీరోయిన్ గా నటించడం ఆ సినిమా చూసినవాళ్లకు గుర్తుండే ఉంటుంది. నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఫౌజీ కాకుండా మరో మూడు కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న చైత్రకు అవకాశాలు బాగానే వస్తున్నాయట. గ్లామర్ షోకు దూరంగా రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయనని చెబుతున్న ఈ 418 దేవికకు టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. 418 తన వరకు పాసైపోయింది కాబట్టి టెన్షన్ లేదు. కాకపోతే గుర్తింపు వచ్చే క్రమం స్లోగా ఉండటంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. రుక్మిణి వసంత్ ఇప్పటికే క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉండగా చైత్రకు ఆ టైం ఎప్పుడు వస్తుందో.
This post was last modified on October 24, 2026 10:17 pm
ఏపీలో జరుగుతున్న స్థానిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర…
ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీలకంగా భావించే ఈ స్థానం..…
నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…
విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు…
కలర్ ఫొటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్.…