కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చట్టాల కారణంగా కార్పొరేట్ వ్యవసాయం పెరిగి.. రైతు మరిన్ని చిక్కుల్లో పడడం ఖాయమని, మరింతగా ఒత్తిడి పెరిగి.. రైతులు పూర్తిగా కార్పొరేట్ శక్తుల హస్తాల్లో చిక్కుకుపోతారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పంటలకు మద్దతు ధరల విషయంలోనూ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్, ఢిల్లీ సరిహద్దలో రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రైతులకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలుకేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, సుప్రీం కోర్టు కూడా ఇటీవల కేంద్రంపై తీవ్ర అసహనం, ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని కూడా నియమించి.. ఈ సమస్య పరిష్కారానికి సుప్రీం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో కేంద్రం సదరు నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నరపాటు అమలు చేయబోమని తెలిపింది. అయినప్పటికీ.. రైతులు మాత్రం మద్దతు ధరలుసహా చట్టంలోని కీలక అంశాలపై పోరాడుతున్నారు. ఇక, ఇప్పటి వరకు రైతులతో ఈ నూతన చట్టాలపై పది మార్లు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ చర్చలు జరిపారు.
ఈ పది మార్లు చర్చల్లోనూ ఎప్పుడూ.. సుహృద్భావ వాతావరణంలో ముగిసిన సందర్భం లేనేలేకపోవడం గమనార్హం. తాజాగా శుక్రవారం 11వ సారి కూడా కేంద్రం, రైతు సంఘాల నాయకుల మద్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు కూడా ముడిపడకపోవ డం గమనార్హం. అంతేకాదు.. ఇరు పక్షాల మద్య ఎవరివాదన వారిదే అన్నట్టుగా కనిపించడం గమనార్హం. మేం ఏడాదిన్నరపాటు చట్టాలను నిలిపి వేస్తామని చెప్పాం.. ఇంతకన్నా. రైతులకు ఏం కావాలి? ` అని కేంద్ర చెప్పగా..
అసలు కేంద్రానికి చర్చించడమే ఇష్టంలేదని, కేవలం 10 నిముషాలు మాత్రమే చర్చలు జరిపి.. మమ అనిపించారు“ అని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పడం గమనార్హం. దీంతో ముడిపడని మహా వివాదంగా ఈ విషయం సాగుతూనే ఉండడం గమనార్హం. ఇక, సుప్రీం కోర్టు వేసిన త్రిసభ్యకమిటీ నుంచి ఒకరు తప్పుకొన్న దరిమిలా.. ఈ సమస్య మరింత జఠిల మయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 22, 2021 7:44 pm
ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ కి కౌంట్ డౌన్ మొదలైపోయింది. బుక్…
జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాద దాడి జరుగుతుందని పాకిస్థాన్కు ముందే తెలుసా? ఈ దాడి పరిణామాల…
ఏపీలో పెను కలకలమే రేపుతున్నమద్యం కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఏపీ ప్రభుత్వ…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే సినిమా మీదే ఉన్నాయి. మిస్ శెట్టి మిస్టర్…
పవన్ కళ్యాణ్ OGతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కొత్త సినిమా 'గ్రౌండ్ జీరో'…
థియేటర్ రిలీజ్ కావాల్సినంత బిల్డప్ ఉన్న సినిమా ఓటిటిలో వస్తే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అందులోనూ ఫైటర్ దర్శకుడు…