Political News

నీటి కష్టాల్లో రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే నీటి వాడకంపై ఆంక్షలు కూడా విధించారు. ఇక, రాబోయే 8 నుంచి 10 నెలల పాటు తీవ్ర కరువు, నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి నగరవాసులను హెచ్చరించారు.

అందుకే, భాగ్యనగర వాసులు సాధ్యమైనంత వరకు నీటి వినియోగం తగ్గించుకోవాలని, ప్రతి ఒక్కరు కనీసం 20 శాతం వాడకం తగ్గించుకుంటే బాగుంటుందని రేవంత్ పిలుపునిచ్చారు. సాగునీటి కంటే తాగునీటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా రేవంత్ చెప్పారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయని, కాబట్టి తెలంగాణలో రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు మాత్రమే సాగు చేయాలని కోరారు. రైతులు కూడా నీటిని అవసరమైన మేర వాడాలని, నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.

గత ఏడాదితో పోలిస్తే కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని ఆయన అన్నారు. రిజర్వాయర్లలో సాధారణంగా ఉండాల్సిన 462 టీఎంసీలకు బదులుగా కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని వెల్లడించారు. ఇక, ఎల్ నినో అనేది ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఉన్న సమస్య అని, దీనిపై రాజకీయ దురుద్దేశంతో బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రకృతి విపత్తులను మనం ఆపలేమని, కానీ, ముందస్తు జాగ్రత్తల వల్ల వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చని అన్నారు. కరువు పరిస్థితులపై 6 నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కంటే ప్రజలకు అండగా నిలవడం ముఖ్యమని అన్నారు. వర్షాకాలం అయిన అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేదని చెప్పారు.

This post was last modified on October 24, 2026 7:01 pm

Share

Recent Posts

టాక్సిక్‌తో దిల్ రాజుకి లాభాలొచ్చాయా?

కేజీఎఫ్‌, కేజీఎఫ్-2 చిత్రాల‌తో పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డిగా అవ‌త‌రించిన య‌శ్ నుంచి.. ఆ త‌ర్వాత…

4 hours ago

ఏఐ కంపెనీల్లో వారికి 5 కోట్లు

టెక్నాలజీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఏఐ నిపుణులకు భారీ జీతాలు ఇస్తారని తెలుసు. కానీ ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రముఖ…

4 hours ago

థియేటర్ల దగ్గర ప్రేక్షకుల సందడెలా ఉంది

కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని…

5 hours ago

మ‌న తిల‌క్ వ‌ర్మ‌నా… లేక మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌నా?

అంత‌ర్జాతీయ క్రికెట్లో గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ…

5 hours ago

పులివెందుల పాయే… తాడేపల్లి సంగతేంటి?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది.…

5 hours ago

చంద్రబాబు-సముద్రం… ఏపీకి ఇంకేం కావాలి..

"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…

6 hours ago