కలర్ ఫొటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్. ఇందులో కలర్ ఫొటో, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలకు ఆయన రచయిత, నిర్మాత. బేబీ మూవీకి దర్శకుడు కూడా. ఈ చిత్రాలతో సీరియస్ ఫిలిం మేకర్‌గా మారిన సాయి రాజేష్ వాటి కంటే ముందు రెండు స్పూఫ్ మూవీస్ తీసిన సంగతి తెలిసిందే. రైటర్ కమ్ డైరెక్టర్‌గా తొలి సినిమా హృదయకాలేయంతో చిన్నపాటి సంచలనం రేపిన అతను.. తర్వాత రైటర్ కమ్ ప్రొడ్యూసర్‌గా కొబ్బరిమట్ట తీశాడు.
ఈ రెండు చిత్రాల్లోనూ సంపూర్ణేష్ బాబే హీరో. సుదీర్ఘ కాలం సెట్స్ మీద ఉన్న కొబ్బరిమట్ట అతి కష్టం మీద రిలీజై ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ఐతే రిలీజ్ టైంలో కంటే తర్వాతే ఈ సినిమాకు ఎక్కువ పేరొచ్చింది. ఈ సినిమాలో సన్నివేశాలు మీమ్ టెంప్లేట్లుగా మారి తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి.
ఇలా ఎప్పుడూ కొబ్బరిమట్ట ట్రెండింగ్‌లోనూ ఉంటూ వస్తోంది. ఇది చూసే ఈ చిత్రాన్ని త్వరలో మళ్లీ థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు సాయిరాజేష్. నవంబరు 14న కొబ్బరిమట్ట రీ రిలీజ్ కాబోతోంది. కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండు నడుస్తున్న సంగతి తెలిసిందే. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే.. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ఆరుగురు ప్రతివ్రతలు లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి తెస్తున్నారు. అది కూడా మీమ్స్ వల్ల సోషల్ మీడియాలో పాపులర్ అయిన సినిమానే.
ఇదే కోవలో కొబ్బరిమట్టను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉండే సన్నవేశాలున్న సినిమా కావడంతో యూత్ దీన్ని థియేటర్లలో బాగానే ఎంజాయ్ చేసే అవకాశముంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో థియేటర్లకు తీసుకొస్తుందో చూడాలి. ఇప్పుడు జనం కనెక్టయ్యారంటే ఫస్ట్ రిలీజ్ కంటే ఎక్కువగానే కలెక్షన్లు వచ్చే ఛాన్సుంది.
This post was last modified on October 24, 2026 8:33 pm
విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు…
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి…
కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్…
యాంకర్ సుమ అంటే వినోదానికి కేరాఫ్ అడ్రస్. ఆమె మైక్ అందుకుందంటే నవ్వులే నవ్వులు. ఆమె ఎమోషనల్ అవడం, కన్నీళ్లు…
తన మేనకోడలు అంజిలి వివాహాన్ని తన ఉమ్మడి ఆస్తి కాంపౌండ్ లో జరపకూడదని మేనమామ జగన్ అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్న…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.…