Political News

సోనియా గాంధీ లవ్ స్టోరీ ఎంత క్యూట్ గా ఉందో!

కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు. చాలా మిత భాషిగా పేరున్న సోనియా గాంధీ సందర్భానుసారంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అటువంటి సోనియా గాంధీ తొలిసారిగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యారు. తన జీవితంలో ప్రేమ, తీపి-చేదు జ్ఞాపకాలు, రాజకీయాలు వంటి అనేక విషయాలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీ “బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్” అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఈ ఏడాది నవంబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుక్ రిలీజ్ గ్లింప్స్ వీడియోలో తమ లవ్ స్టోరీని రివీల్ చేశారు సోనియా.

1960ల నాటి తమ ప్రేమ ప్రయాణాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న ‘వర్సిటీ రెస్టారెంట్’ అనే ఒక గ్రీక్ రెస్టారెంట్‌లో సోనియా, రాజీవ్ గాంధీ తొలిసారి కలుసుకున్నారు. ఇటలీ వంటకాల కోసం ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సోనియాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో పరిచయం ఏర్పడింది. రాజీవ్ తో జీవితాన్ని పంచుకోవాలని తొలిచూపులోనే తనకు అనిపించిందని, రాజీవ్ మనసులో కూడా అదే భావన కలిగిందని సోనియా చెప్పారు.

చక్కని రూపంతో పాటు అత్యంత సున్నితమైన స్వభావం, మృదువైన ప్రవర్తన వల్లే రాజీవ్ గాంధీని ఇష్టపడ్డానని చెప్పారు. ఆ పరిచయం తర్వాత ఇద్దరూ కలిసి స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం, నగరరంలో తిరగడం చేస్తూ మరింత దగ్గరయ్యామని అన్నారు. సుదీర్ఘకాలం ప్రేమించుకున్న తర్వాత 1968 ఫిబ్రవరి 25న వివాహ బంధంతో ఒక్కటయ్యామని చెప్పారు. ఇలా రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ గురించి సోనియా గాంధీ రివీల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, ఆ పుస్తకంలో వీరిద్దరి లవ్ స్టోరీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయని, వాటిని తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు అంటున్నారు.

This post was last modified on October 24, 2026 6:54 pm

Share

Recent Posts

మాట నిలబెట్టుకుంటే అదే పెద్ద కానుక

నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ…

20 minutes ago

సూపర్ హిట్ రణబాలి అని పిలవండి

విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ర‌ణ‌బాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వ‌ర‌కు…

55 minutes ago

కొబ్బరి మాటను ఈసారైనా చూస్తారా

క‌ల‌ర్ ఫొటో, బేబీ, చెన్నై ల‌వ్ స్టోరీ చిత్రాల‌తో టాలీవుడ్లో త‌న‌కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్‌.…

1 hour ago

నీటి కష్టాల్లో రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వచ్చే ఏడాది వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని నగరవాసులు ఎదుర్కోవాల్సి…

2 hours ago

ఏడ్చి ఏడిపించేసిన సుమ‌, రాజీవ్!

యాంక‌ర్ సుమ అంటే వినోదానికి కేరాఫ్ అడ్ర‌స్. ఆమె మైక్ అందుకుందంటే న‌వ్వులే న‌వ్వులు. ఆమె ఎమోష‌న‌ల్ అవ‌డం, క‌న్నీళ్లు…

3 hours ago

నా కూతుళ్ల పెళ్ళిళ్ళు కూడా బెంగళూరు ప్యాలెస్ లో జరపను: జగన్

తన మేనకోడలు అంజిలి వివాహాన్ని తన ఉమ్మడి ఆస్తి కాంపౌండ్ లో జరపకూడదని మేనమామ జగన్ అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్న…

4 hours ago