నిన్న విడుదలైన ఫౌజీ ఇంట్రో టీజర్ మీద సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాజిక్స్ ప్రశ్నిస్తూ కొందరు, క్వాలిటీ మీద మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిజి విషయంలో ఎక్కువ శాతం అసంతృప్తి కనిపించింది. నిజానికి ముందు ప్లాన్ చేసుకున్న కంటెంట్ ఇది కాదట. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్లాన్ బి అమలు చేశామని, అందుకే ఆలస్యం అయ్యిందని నిర్మాత రవిశంకర్ 418 సక్సెస్ మీట్ లో చెప్పారు.
అంటే అసలు మ్యాటర్ వేరే ఉందన్న మాట. ప్రభాస్ పుట్టినరోజుని ఏదో మేనేజ్ చేశారు కానీ దర్శకుడు హను రాఘవపూడి వేసుకున్న స్కెచ్ వేరే అనే క్లారిటీ వచ్చేసింది. ఇక విడుదల తేదీ గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. మార్చి 19 ఎట్టి పరిస్థితుల్లో మిస్ కామని, ఒక నెల ముందే సంసిద్ధంగా ఉండి సినిమాను పెద్ద స్థాయిలో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఇదే రవిశంకర్ డిసెంబర్ 4 వస్తామని చెప్పారు కానీ జరగలేదు. ఇప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి.
సరే ఇదంతా ఎలా ఉన్నా మాట తప్పకపోతే చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫౌజీ కోసమే స్పిరిట్ అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఎలాగూ టైం ఉంది కదాని షూటింగ్ కూడా కొంచెం నెమ్మదించి ఎక్కువ డేట్లు ఫౌజీకి కేటాయిస్తున్నారు. ఒక చిన్న టీజర్ కే ప్లాన్ బి అమలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉందంటే అసలు సినిమాకు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అంచనాలు పీక్స్ లో ఉన్నప్పుడు వాటిని మ్యాచ్ చేయాల్సిన బాధ్యత రాఘవపూడిదే.
అలాని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అక్టోబర్ మినహాయిస్తే ఫౌజీ చేతిలో ఉన్నది కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే. ప్యాన్ ఇండియా మూవీకి ఇది ఎక్కువ గడువని చెప్పడానికి లేదు. పైగా క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడని హను రాఘవపూడి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయిస్తారు. షూట్ పూర్తయిన భాగానికి ఇప్పటికే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి టెన్షన్ అవసరం పడకపోవచ్చు. ఏదైతేనేం మార్చి 19 ఫౌజీ ఆగమనం జరగడమే ప్రేక్షకులకు కావాల్సింది.
This post was last modified on October 24, 2026 9:19 pm
ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…
ఏపీలో జరుగుతున్న స్థానిక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర…
ప్యారడైజ్ థియేటర్ రన్ అయిపోయి రోజులు గడిచిపోయాయి. నైజామ్ మినహాయించి మిగిలిన చోట్ల డిజాస్టర్ కావడం ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇది…
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థులుగా ముగ్గురు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో కీలకంగా భావించే ఈ స్థానం..…
విజయ్ దేవరకొండ కొత్త సినిమా రణబాలికి ఆరంభంలో ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలిసిందే. రివ్యూలు కూడా చాలా వరకు…
కలర్ ఫొటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సాయి రాజేష్.…