స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి నామినేషన్ల పర్వంలో అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నట్లు ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పందించారు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులైనా సరే స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయడానికి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో డీజీపీ మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద పోలీసులు ఏకపక్షంగా కేసులు పెడుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై డీజీపీ స్పందించారు. ఆధారాలు లేకుండా ఎవరినీ కేసుల్లో ఇరికించమని తేల్చి చెప్పారు. అలాగే అధికార పార్టీ నాయకులైనంత మాత్రానా ఎవరినీ రక్షించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. సీసీ కెమేరాలు, డ్రోన్లతో హింసకు కారకులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నామినేషన్ల దాఖలు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మార్కాపురం, నెల్లూరు, పల్నాడు, కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య వంటి జిల్లాల్లో నమోదైన ఘటనలకు సంబంధించి నిందితులను గుర్తించి వారి మీద కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు.
స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, హింసాత్మాక చర్యలకు పాల్పడిన వారితో పాటుగా ప్రోత్సహించిన వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లేనని చెప్పొచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో 1 వ తేదీ వరకు గడువు లభించింది. దీని తర్వాత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు జరిగినట్లు పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సమావేశం నిర్వహించి పోలీసు అధికారులను అలెర్ట్ చేసినట్లు చర్చ జరుగుతుంది.
This post was last modified on October 24, 2026 9:22 am
రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…
కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…
టాలీవుడ్ దర్శకుల్లో వివాదాలకు దూరంగా కాసింత ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అందాల రాక్షసి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత…
రణబాలి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్ లో ఒక మంచి విషయం చెప్పారు. ఇకపై బిజినెస్…
‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్.. తర్వాత దశాబ్ద కాలంలో దర్శకుడిగా రూపొందించింది…