ఈ దసరాకు జైలర్-2, రణబాలి లాంటి పెద్ద సినిమాలకు పోటీగా రెండు చిన్న చిత్రాలు కూడా రిలీజయ్యాయి. వాటిలో అనుపమ పరమేశ్వరన్ సినిమా ‘క్రేజీ కళ్యాణం’ ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే అదృశ్యం అయిపోయింది. కానీ ఆనంది లీడ్ రోల్ చేసిన ‘గరివిడి లక్ష్మి’ మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుని కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.
రెండు పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఆ చిత్రం వారం తర్వాత కూడా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూస్తే షాకవ్వక తప్పదు. తొలి రోజు నుంచి ఈ ప్రాంతంలో ఈ సినిమాకు ఈ ప్రాంతంలో మంచి ఆక్యుపెన్సీలు పడుతున్నాయి. కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. ఇప్పుడీ సినిమా జైలర్-2, రణబాలి లాంటి పెద్ద సినిమాలను కూడా దాటేసింది.
గురువారం రోజు ఉత్తరాంధ్ర మొత్తంలో ‘గరివిడి లక్ష్మి’ రూ.32 లక్షల షేర్ రాబట్టడం విశేషం. ఇదే రోజు రజినీకాంత్ సినిమాకు రూ.28 లక్షలు, విజయ్ మూవీకి రూ.13 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. పెద్ద స్టార్లు నటించిన మాస్ మూవీస్‌ను ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ బయోపిక్ దాటేయడం చిన్న విషయం కాదు. ఈ సినిమా ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఆ ప్రాంత కళాకారిణి మీద తీసిన సినిమా అయినా సరే.. జనం ఇంతలా కనెక్ట్ అయి ఆదరించడం చిన్న విషయం కాదు. ఈ సినిమా మీద పెట్టుబడిని మించి ఉత్తరాంధ్రలో వసూళ్లు వచ్చాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఈ చిత్రం డబ్బులే కాదు, గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది గొప్ప పేరే సంపాదించింది. ఈ చిత్రాన్ని గౌర్నాయుడు జమ్ము రూపొందించాడు. ఈ మూవీ చివర్లో రియల్ గరివిడి లక్ష్మిని చూపించడం విశేషం.
This post was last modified on October 24, 2026 1:35 pm
ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలే తీశాడు. తన సమకాలీన దర్శకులు, తనకంటే జూనియర్లు…
స్థానిక ఎన్నికలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక లిటిగేషన్ సృష్టించడమే కాకుండా చీటికీ మాటికీ కోర్టుకు…
“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…
చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…
రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…
కాలేజీల్లో సినిమా ఈవెంట్లు చెయ్యడం ఈ మధ్య ట్రెండుగా మారింది. దాని వల్ల సినిమాలకు ప్రయోజనమేనా.. అదే సమయంలో కాలేజీల్లో…