Political News

జగన్ ఇల్లు ఏమైనా ఫంక్షన్ హాలా?

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుంది. ఈ పెళ్లిని బెంగుళూరులోని జగన్ నివాసంలో జరపాలని షర్మిల అనుకున్నారని, కానీ, అందుకు జగన్ నిరాకరించారని టాక్ వస్తోంది. ఈ విషయం గురించి కొన్ని తెలుగు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. జగన్, షర్మిలల ఇళ్లు పక్కపక్కనే ఒకే కాంపౌండ్ లో ఉండడంతో అక్కడ పెళ్లి వేడుక నిర్వహించే హక్కు షర్మిలకు ఉందని, దానిని జగన్ కాలరాస్తున్నారన్నది ఆ కథనాల సారాంశం. ఈ క్రమంలోనే ఆ విషయంపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీనిచ్చారు.

బెంగుళూరులోని ఎలహంకలో జగన్, షర్మిలలకు ఒకే జాయింట్ ప్రాపర్టీ ఉందని, ఆ ప్రాపర్టీలో ఒకే ఎంట్రీ గేట్ లో జగన్, షర్మిలల రెండు ఇళ్లు పక్క పక్కన ఉన్నాయని చెప్పారు. అయితే, వారిద్దరికీ భేదాభిప్రాయాలున్నాయని, ఇద్దరిలో జగన్ కు ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని చెప్పారు.

అటువంటి హై ప్రొఫైల్ వ్యక్తి కాంపౌండ్ లో పెళ్లిళ్లు చేయడం ఎలా కుదురుతుంది అని ఆయన ప్రశ్నించారు. పైగా, అది కళ్యాణమండపం కాదని చెప్పారు. ఆ రెండు ఇళ్లు ఒకే కాంపౌండ్ లో ఉండడంతో ఒకే గేట్ ఉందని, జగన్, షర్మిల, విజయమ్మ అందరూ ఒకే గేటులో నుంచి లోపలికి వెళ్లాలని చెప్పారు.

పెళ్లి అంటే క్లీనింగ్, క్యాటరింగ్, డెకరేషన్ తదితర విభాగాలకు చెందిన వ్యక్తులు, పెళ్లికి అతిథులు వస్తారని, భద్రతా రీత్యా ఆ కాంపౌండ్ లో పెళ్లి ఎలా సాధ్యం అవుతుందని నాని ప్రశ్నించారు. ఇదే విషయం షర్మిలకు జగన్ చిలక్కి చెప్పినట్లు చెప్పాడని గుర్తు చేశారు. అయినా, బెంగుళూరులో బోలెడు హాల్స్ ఉన్నాయని అన్నారు.

ఇక, చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ కు శుక్రవారం వెళ్లి సోమవారం వస్తున్నారని, వాళ్ల ఇంటి ఫొటోలు ఎప్పుడైనా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ, ఈనాడులో రామోజీరావు వాళ్ల అబ్బాయి ఎప్పుడైనా ప్రచురించారా అని ప్రశ్నించారు.

This post was last modified on October 23, 2026 11:26 am

Share

Recent Posts

బన్నీ ట్వీట్.. చిరుపై ట్రోలింగ్.. ఇదేం చిత్రం?

సోషల్ మీడియా జనాలకు ఫ్యాన్ వార్స్ చేయడానికి.. ట్రోల్స్ చేయడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. దేన్నుంచయినా సరే.. ఒక పాయింటు…

57 minutes ago

కొత్త ట్రెండు… ఎవరి సినిమా వాళ్లు చూస్తున్నారు

కథ ఎక్కడ జరిగినా సరే, అందులో ఏ ప్రాంత భాష, యాస ఉన్నా సరే.. అన్ని ప్రాంతాల వాళ్లూ చూస్తేనే…

2 hours ago

మంచినీళ్ల బాటిల్ తీసాడని చంపేసారా?

మంచి నీళ్ల బాటిల్ దొంగతనానికి ప్రయత్నించడమే అతడి నేరమైంది. పోనిలే పాపం.. ఎంత దాహం మీద వున్నాడో అని వదిలి…

5 hours ago

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

12 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

12 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

13 hours ago