ప్రేమద ఊరలి.. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన కన్నడ చిత్రమిది. గత నెల ఈ సినిమా రిలీజైనపుడు మొదట్లో దీని మీద పెద్దగా చర్చ లేదు. కానీ తర్వాత ప్రేక్షకుల్లోకి సినిమా బాగా వెళ్లిపోయింది. కన్నడిగులు నెల రోజులుగా విరగబడి చూస్తున్నారీ సినిమాను. ఏకంగా వంద కోట్ల వసూళ్ల మార్కును ఈ సినిమా అందుకుంది. ‘టాక్సిక్’ లాంటి భారీ చిత్రాన్ని దాటి ఈ ఏడాది కన్నడలో హైయెస్ట్ గ్రాసర్‌గానూ నిలిచింది.
ఈ సినిమా చూసి కన్నడ ప్రేక్షకులు కదిలిపోతున్నారు. థియేటర్లలో వాళ్ల ఎమోషన్ చూస్తే.. ఒక సినిమా ఇంతగా జనాలను ప్రభావితం చేస్తుందా అనిపిస్తోంది. ఇందులో మరీ గొప్ప కథేమీ ఉండదు. సగటు ఫ్యామిలీ డ్రామానే. కానీ దానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా బయట కూడా జనాల మీద ఎంతగా ప్రభావం చూపిస్తోందో చెప్పడానికి ఓ ఉదాహరణను చెప్పుకోవాలి.
‘ప్రేమద ఊరలి’ సినిమా చిత్రీకరణ జరుపుకున్న ప్రాంతాలు ఇప్పుడు కన్నడ నాట బాగా పాపులర్ అయిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించే సీగెగుడ్డ అనే ఆధ్యాత్మిక ప్రాంతం ఇప్పుడు జనాలతో కిటకిటలాడుతోంది. హసన్‌కు దగ్గర్లోని ఈ ప్రాంతం అంతకుముందు అంత పాపులర్ కాదు. కానీ ‘ప్రేమద ఊరలి’ రిలీజయ్యాక అది పెద్ద టూరిజం ప్లేస్‌లా మారిపోయింది. జనం విపరీతంగా వస్తుండడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి.
ఈ హిల్ స్టేషన్‌లో మునుపెన్నడూ చూడని జనం కనిపిస్తున్నారు. ఇక్కడి గుడిలో కూడా జనసందోహం బాగా పెరిగింది. కొందరు దీనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇంతకుముందు ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేదని.. కానీ ఇప్పుడు జనం విరగబడి వస్తుండడంతో ఆ ప్రశాంతత అంతా పోయిందని స్థానికులు అంటున్నారు. కానీ ఇక్కడ వ్యాపారాలు మాత్రం బాగా జరుగుతుండడంతో వాళ్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 23, 2026 1:41 pm
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయినా.. తన ప్రతి సినిమా స్కేల్, కాన్వాస్, బడ్జెట్లు చాలా పెద్దవే అయినా…
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను తన రాజకీయ వారసురాలిగా…
నిర్మాత బన్నీ వాస్ ఇవాళ జరిగిన ఇడుపు కాగితం సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఏఐ గురించి మాట్లాడుతూ రాబోయే…
రాను రాను సోషల్ మీడియా మరీ టాక్సిక్ అవుతోందని కొందరు సినీ ప్రముఖులు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. జైలర్…
విశ్వక్ సేన్ కల్ట్ అక్టోబర్ 30 విడుదలకు రెడీ అవుతోంది. ఆదర్శ కుటుంబంతో పోటీ ఎందుకు లెమ్మని ఇట్లు అర్జున,…
జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ సినిమాలతో పోటీ పడి చాలా పెద్ద రిస్కు చేసిన గరివిడి లక్ష్మి రికార్డులు…