Movie News

బన్నీ ట్వీట్.. చిరుపై ట్రోలింగ్.. ఇదేం చిత్రం?

సోషల్ మీడియా జనాలకు ఫ్యాన్ వార్స్ చేయడానికి.. ట్రోల్స్ చేయడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. దేన్నుంచయినా సరే.. ఒక పాయింటు తీసుకుని గొడవలు పడతారు. ట్రోల్స్ చేస్తారు. ఇందుకు తాజా ఉదాహరణ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసిన ట్వీట్ అనంతర పరిణామాలే.

బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం ‘జైలర్-2’ను కొనియాడుతూ బన్నీ లేటెస్ట్‌గా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాడు. అందులో రజినీకి ఎలివేషన్ ఇస్తూ.. ‘‘చొక్కా నలగకుండా 500 CR+ కొట్టడం ఒక్క రజినీ గారికే సాధ్యం’’ అని ఒక లైన్ జోడించాడు బన్నీ.

ఇందులో ఎక్కడా చిరంజీవి ప్రస్తావన లేదు. దీంతో ఆయనకు సంబంధమూ లేదు. కానీ ఈ లైన్ పట్టుకుని మెగాస్టార్‌ను ఒక వర్గం ట్రోల్ చేస్తుండడం గమనార్హం. బన్నీ కామెంట్ చిరుకు కౌంటర్ అంటూ కొందరు ఇందులోంచి వేరే అర్థాలు తీస్తున్నారు.

ఒకప్పుడు రజినీకి దీటుగా ఉన్న చిరు.. ఇప్పుడు తన స్టార్ పవర్ కోల్పోయాడని.. రజినీలా తెర మీద మ్యాజిక్ చేయలేకపోతున్నాడని ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. రజినీ పాన్ ఇండియా స్థాయిలో ఇంత ప్రభావం చూపిస్తుంటే.. చిరు మాత్రం తన పరిధిని అంతకంతకూ తగ్గించేసుకుంటున్నాడని ఆయన మీద కౌంటర్లు వేస్తున్నారు.

చిరు సమకాలీనుడైన రజినీ ఇప్పటికీ తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తున్నాడని, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడని.. కానీ చిరు మాత్రం తన ఆకర్షణను కోల్పోయాడని, ఇంకా డ్యాన్సులు, డ్యూయెట్లు అంటూ ఒక మూసలోనే వెళ్తున్నాడని ఆయన మీద నెగెటివ్ చేస్తున్నారు. ఇందులో బన్నీ అభిమానులతో పాటు వేరే ఫ్యాన్ డమ్స్ కూడా ఉన్నాయన్నది చిరు అభిమానుల ఆరోపణ.

ఐతే ఎవరి బలం వారిదని.. వయసు ప్రభావంతో డ్యాన్సులు, ఫైట్లు చేయలేని రజినీ బలహీనత గురించి మాట్లాడకుండా, 70 ప్లస్‌లోనూ అభిమానులను అలరించేందుకు కష్టపడుతున్న చిరు మీద ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని మెగా ఫ్యాన్స్ గట్టిగానే తిప్పికొడుతున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో భారీ విజయాన్నందుకున్న చిరు.. ‘కాకా’ దాన్ని మించిన సక్సెస్ కొట్టి తనేంటో రుజువు చేస్తారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 23, 2026 10:38 am

Share

Recent Posts

జగన్ ఇల్లు ఏమైనా ఫంక్షన్ హాలా?

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమార్తె వివాహం నవంబరు 25న జరగనుంది. ఈ పెళ్లిని బెంగుళూరులోని జగన్ నివాసంలో జరపాలని షర్మిల…

31 minutes ago

కొత్త ట్రెండు… ఎవరి సినిమా వాళ్లు చూస్తున్నారు

కథ ఎక్కడ జరిగినా సరే, అందులో ఏ ప్రాంత భాష, యాస ఉన్నా సరే.. అన్ని ప్రాంతాల వాళ్లూ చూస్తేనే…

2 hours ago

మంచినీళ్ల బాటిల్ తీసాడని చంపేసారా?

మంచి నీళ్ల బాటిల్ దొంగతనానికి ప్రయత్నించడమే అతడి నేరమైంది. పోనిలే పాపం.. ఎంత దాహం మీద వున్నాడో అని వదిలి…

6 hours ago

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

12 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

13 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

14 hours ago