వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ నాయకులు, కూటమి పార్టీల నేతల మధ్య భారీ ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఇరు పక్షాల మధ్య ఘర్షణ కొనసాగుతుండడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఏం జరిగింది?
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఉదయం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. వైసీపీ అధిష్టానం.. ఇప్పటికే పోటీ చేసేవారి పేర్లను ఖరారు చేయడంతో పుంగనూరు నుంచే తొలి నామినేషన్ల ఘట్టాన్ని వైసీపీ నాయకులు ప్రారంభించారు. పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్లు వేసేందుకు నాయకులు 4 కార్లలో తరలి వచ్చారు. వీరిలో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు నామినేషన్లు వేసేందుకు వచ్చారు.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు.. భారీ సంఖ్యలో తరలి వచ్చి.. వైసీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు వైసీపీ నేతలు ప్రయాణిస్తున్న కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలోనే పలువురికి రాళ్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి ఇరు పక్షాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. పరిస్థితిలోమార్పు రాకపోవడంతో గాలిలోకిరెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
దారుణం: వైసీపీ
తమ కార్యకర్తలు సహా.. ఎంపీ మిథున్రెడ్డి వాహన శ్రేణిపై రాళ్లు రువ్విన ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన దారుణమని తెలిపింది. నామినేషన్లు వేసేందుకు తమ వారు ప్రశాంతంగా బయలుదేరారని.. అయినప్పటికీ టీడీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారని విమర్శలు గుప్పించింది.
This post was last modified on October 16, 2026 12:10 pm
తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…
ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం…
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు పార్టీ నాయకత్వాన్ని మండల స్థాయి నుంచి జిల్లా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ముఖ్యంగా పోగొట్టుకున్నచోటే ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి…