Movie News

హైప్ లేద‌న్నారు… ఇప్పుడు బానే చూస్తున్నారు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త సినిమా జైల‌ర్‌-2కు హైప్ లేదు హైప్ లేదు అని.. పెద్ద డిస్క‌ష‌నే న‌డిచింది సోష‌ల్ మీడియాలో. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ అయినా స‌రే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ప్రోమోలు, పాట‌లు లేవ‌ని అభిమానులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇంకోవైపేమో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో జ‌ర‌గ‌లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ప‌రిస్థితి చాలా నిరాశాజ‌న‌కంగా క‌నిపించింది. దీంతో జైల‌ర్-2 ప‌రిస్థితి ఏమ‌వుతుందో ఏమో అని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి.
అందుకు త‌గ్గ‌ట్లే సినిమాకు డివైడ్ టాకే వ‌చ్చింది.

రివ్యూలు కూడా మోడ‌రేట్‌గా ఉన్నాయి. అయితే ఇన్ని ప్ర‌తికూల‌త‌లున్న‌ప్ప‌టికీ.. జైల‌ర్-2 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చూపిస్తున్న దూకుడు చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. నిన్న‌టిదాకా తెలుగు వెర్ష‌న్‌కు అస‌లు హైప్ లేదు అనుకుంటుంటే.. తొలి రోజు థియేట‌ర్లు మాత్రం జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోయాయి. ర‌జినీని ఎప్ప‌ట్లాగే మ‌న ప్రేక్ష‌కులు సెల‌బ్రేట్ చేస్తున్నారు. థియేట‌ర్ల‌లో సంబ‌రాలు మామూలుగా లేవు.

ఎలివేష‌న్ సీన్ల‌కు రెస్పాన్స్ ఒక రేంజిలో ఉంది. థియేట‌ర్ల‌లో వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. సినిమాలో విష‌యం వీక్ అయిన‌ప్ప‌టికీ.. ర‌జినీ ఆరా, ఆయ‌న స్క్రీన్ ప్రెజెన్స్, ఎలివేష‌న్ సీన్లు వ‌ర్క‌వుట్ కావ‌డంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ మాత్రం చాలులే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక త‌మిళంలో అయితే.. చాలామంది స్టార్లు ఈ రోజుకు ర‌జినీ అభిమానులుగా మారిపోయి థియేటర్ల‌కు వ‌రుస క‌ట్టేస్తున్నారు. అక్క‌డ ప్రేక్ష‌కుల‌ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది.

సినిమా టాక్‌ను మించి జైల‌ర్-2 బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భావాన్ని చూప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కొత్తగా రిలీజ‌వుతున్న మిగ‌తా చిత్రాల‌కు జైల‌ర్-2 పెద్ద ముప్పుగా ప‌రిణ‌మించేలా ఉంది. వాటికి మంచి టాక్ రాక‌పోతే.. ర‌జినీ దెబ్బ‌కు కుదేల‌వ్వ‌క త‌ప్ప‌దు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైల‌ర్-2 సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. ఈ సినిమా జైల‌ర్ వ‌సూళ్ల‌ను దాట‌డం ఇప్పటికైతే సాధ్యమని చెప్పలేం.

This post was last modified on October 16, 2026 12:14 pm

Share

Recent Posts

నాగార్జున మళ్ళీ పంచులు వేశారు

కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…

2 hours ago

ఏపీలో నామినేష‌న్ల తొలిరోజు: ర‌ణ‌రంగ‌మే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శుక్ర‌వారం తెర‌దీశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే.. తొలిరోజే ఉమ్మ‌డి క‌డ‌ప, ఉమ్మ‌డి…

3 hours ago

సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

3 hours ago

జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…

3 hours ago

లేడీ విలన్‌ని వాడుకోవడం ఒక కళ

తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…

5 hours ago

రామాయణ లెక్కలు ఇప్పుడు సరిపోయాయా

నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…

6 hours ago