Political News

నేటి నుంచే నామినేష‌న్లు: వైసీపీనే ముందు… కూటమి లేటు!

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు(శుక్ర‌వారం) ప్రారంభంకానుంది. ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 పట్టణ స్థానిక సంస్థలలో నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభం కానుంది. వీటిలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్ర‌క్రియ కేవలం రెండు రోజులు మాత్ర‌మే సాగ‌నుంది. 18వ తేదీన నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగియ‌నుంది.

అనంత‌రం.. 19న నామినేష‌న్ల‌ను ప‌రిశీలిస్తారు. 21న మ‌ధ్యాహ్నం 3 వ‌రకు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ కొన‌సాగుతుంది. ఈ నెల 28న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక‌, ఈసారి ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లను ప్రజలు నేరుగా (ప్రత్యక్ష పద్ధతిలో) ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలను ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు. కోర్టు కేసులు, ఇత‌ర‌ న్యాయపరమైన వివాదాల కారణంగా రాష్ట్రంలోని మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు (4 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు) ఎన్నికలను వాయిదా వేశారు.

వైసీపీనే ముందు..

తాజాగా ప్రారంభంకానున్న నామినేష‌న్ల ప్ర‌క్రియ‌లో వైసీపీ నేత‌లే తొలుత నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే తొలిద‌శ పోరుకు సంబంధించి వైసీపీ అధిష్టానం నాయ‌కుల‌ను ఎంపిక చేసింది. దీంతో అభ్య‌ర్థులు తొలి రెండు రోజుల్లోనే నామినేష‌న్ల‌ను పూర్తి చేసేలా ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేశారు. కూట‌మి పార్టీల నేత‌ల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. ముందుగానే ఈ ప్ర‌క్రియ‌లో వైసీపీ పాల్గొన‌నుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు.

కూట‌మిలో లేటు..

కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థులు తొలిద‌శ నామినేష‌న్ల‌ను ఒకింత ఆల‌స్యంగానే దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు తెలు స్తోంది. ఇప్ప‌టికి సీట్ల కేటాయింపు జ‌రిగినా.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ మాత్రం కొన‌సాగుతోంది. ఈ పేర్లు ఖ‌రారు కావ‌డంతోపాటు స్థానికంగా త‌లెత్తే ఇబ్బందుల‌ను, రెబ‌ల్స్‌ను కూడా అంచనావేసుకుని ఎంపిక ప్ర‌క్రియ చేప‌ట్టారు. దీంతో నామినేష‌న్ల ప్ర‌క్రియ విష‌యంలో కూట‌మి ఒకింత ఆల‌స్యంగానే అడుగులు వేయ‌నుంద‌ని తెలుస్తోంది.

This post was last modified on October 16, 2026 11:55 am

Share

Recent Posts

లేడీ విలన్‌ని వాడుకోవడం ఒక కళ

తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…

1 hour ago

రామాయణ లెక్కలు ఇప్పుడు సరిపోయాయా

నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…

2 hours ago

దేవరకొండ జంటను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు

ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం…

3 hours ago

దేశంలో గందరగోళం సృష్టించేందుకు లైసెన్స్ ఇవ్వలేదు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల…

3 hours ago

ప్రకాశం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పోకూరి?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు పార్టీ నాయకత్వాన్ని మండల స్థాయి నుంచి జిల్లా…

5 hours ago

కాంగ్రెస్‌.. చేతులెత్తిన‌ట్టే.. ఆ ఓటు కూట‌మికే.. !

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ముఖ్యంగా పోగొట్టుకున్నచోటే ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి…

5 hours ago