నిన్నా మొన్నటిదాకా బీజేపీ ఏమి చేసినా తలూపిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సర్ విషయంతో పాటుగా సీజేపికి అనుకూలంగా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడంతో కమలనాధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా జగన్ వైఖరిని నిశితంగా గమనిస్తున్న బీజేపీ నాయకులు వేచి చూసే ధోరణిలో వున్నారు. ఇప్పుడిక సీజేపీకి అనుకూలంగా పోస్టు పెట్టడం తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇంతకూ జగన్ ఏమని మెసేజ్ పెట్టారంటే…
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. కేవలం నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో వున్న లోపాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
అంతటితో ఊరుకోకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేవలం స్పందించే ధోరణితో వ్యవహరించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పిన ఆయన ముందుచూపుతో కూడిన చొరవ చూపించడం మంచి ఫలితాలను ఇస్తుందని హితవు పలికారు. సీజేపీ నాయకుల అరెస్టును ఉద్దేశించి సౌరవ్, అశుతోష్లకు నా సానుభూతిని ప్రకటిస్తున్నానంటూ మెసేజ్ పెట్టారు. ఇది బీజేపీ నాయకులకు పుండు మీద కారం చల్లినట్టయ్యిందని ప్రచారం జరుగుతుంది.
అసలే కాక్రోచ్ ల ఆందోళనతో బీజేపీకి ఊపిరాడటం లేదని ప్రచారం జరుగుతుంది. మొన్నటికి మొన్న సీజేపీ దెబ్బకు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ అవమానం నుంచి బయట పడక ముందే ఎన్నికల కమిషనర్ రాజీనామా ఆందోళన మొదలయ్యింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని బీజేపీ దారులు వెదుక్కుంటూ వున్న నేపథ్యంలో నమ్మకస్తుడిగా నటిస్తూ వచ్చిన జగన్ అసలు స్వరూపం బయట పెట్టారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్ కు గట్టి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
బీజేపీకి చెందిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఘాటుగా స్పందించారు. జగన్ వైఖరిని తప్పుబడుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మీరు గెలిచినప్పుడేమో వ్యవస్థ అంతా బాగున్నట్టు, ఓడిపోగానే ఎన్నికల ప్రక్రియ అంతగా చెడిపోయిందా.. అని సూటిగా ప్రశ్నించారు. సీజేపీ అరెస్టుల విషయంలో స్పందిస్తూ…పోలీసులు చట్టప్రకారం అదుపులోకి తీసుకున్న వారిని సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఎన్నికల ప్రక్రియ మీద సందేహాలు వ్యక్తం చేయడం సహజమేనని, ఇప్పుడు జగన్ కూడా లూజర్స్ క్లబ్ లో చేరారని ఎద్దేవా చేశారు. బీజేపీతో జగన్ అనవసరంగా పెట్టుకున్నాడని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 16, 2026 10:30 am
అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు…
ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని…
కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శుక్రవారం తెరదీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తొలిరోజే ఉమ్మడి కడప, ఉమ్మడి…
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…
నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…