ఔను… మీరు వింటుంది నిజమే. ఒక మహిళ గ్యాంగ్ రేప్ కు ఎలా పాల్పడుతుంది.. అసాధ్యమనే కదా మీరు ఆలోచిస్తుంది. కానీ న్యాయపరంగా అది నేరమంటుంది ఢిల్లీ హైకోర్టు. స్వయంగా ఆమె రేప్ చేయక పోయినా గ్యాంగ్ రేప్ కు సహకరించడం కూడా నేరం కిందకు వస్తుందని తీర్పు ఇచ్చింది. ఇంతకూ ఏమి జరిగిందంటే…
ఢిల్లీలోని ఒక మహిళకు వివాహేతర సంబంధం వుంది. అయితే ఆమె తన ప్రియుడితో లైంగిక సంబంధం పెట్టుకోమని మైనర్ అయిన కూతురి మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అందుకోసం బలవంతం చేసింది. ఈ విషయం మీద బాధిత బాలిక జూలై 2024 లో ఢిల్లీలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్ కు పంపించారు. ఈ కేసులో ట్రయల్ కోర్ట్ జనవరి 17, 2025న సదరు తల్లిపై బీఎన్ఎస్ సెక్షన్ 70(2) మైనర్లపై గ్యాంగ్ రేప్ కేసుతో పాటు పోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది. ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్ కేసు నమోదు సంచలనం సృష్టించింది.
అత్యాచారం అనేది కేవలం పురుషుడు మాత్రమే చేయగల నేరం కాబట్టి తనపై నమోదు చేసిన గ్యాంగ్ రేప్ అభియోగాలు చెల్లవంటూ ఆ తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ చారిత్రక తీర్పును వెలువరించారు. సామూహిక అత్యాచారం కేసుల్లో నిందితులకు సంహరించినా, అలాంటి ఉద్దేశ్యాన్ని బలపరిచిన మహిళ మీద కూడా గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయవచ్చని తీర్పు ఇచ్చారు.
చట్టంలో ఉపయోగించిన ‘ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు’ అనే పదబంధాన్ని కేవలం పురుషులకు మాత్రమే పరిమితం చేయడానికి ఎటువంటి హేతుబద్ధమైన ఆధారం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలిని లొంగదీసుకోవడం, నిందితులకు అనుకూలంగా వ్యవహరించడం, నేరపూరిత ఉమ్మడి ఉద్దేశాన్ని కలిగి ఉండటం ద్వారా మహిళలు కూడా ఈ నేరంలో భాగస్వాములు కావచ్చని స్పష్టం చేశారు.
ఈ తీర్పు చారిత్రత్మక మైందని న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఈ తీర్పుతో ఇప్పటివరకూ సామూహిక లైంగిక దాడి కేసుల్లో ఉన్న అస్పష్టత తొలగిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు గ్యాంగ్ రేపు లకు సహకరించిన కొందరు మహిళలు తమ మీద కేసు నమోదు కాదనే ధైర్యంతో వున్నారు. ఇక ముందు అలాంటి సాకులు చెల్లవని, నేరం ఎవరు చేసినా కేసు నమోదు చేయాల్సిందేనని ఈ కేసుతో తేలిందని చెబుతున్నారు
This post was last modified on October 16, 2026 10:04 am
అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు…
ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని…
కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శుక్రవారం తెరదీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తొలిరోజే ఉమ్మడి కడప, ఉమ్మడి…
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…
నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…