జైలర్ మొదటి భాగం విడుదలైనప్పుడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. సింపుల్ ఎలివేషన్లు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సహాయంతో సూపర్ స్టార్ విశ్వరూపాన్ని చూపించిన విధానం ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించింది. అందుకే జైలర్ 2 మీద అంత బజ్ వచ్చింది. అయితే ప్రోమోల నుంచి ట్రైలర్ దాకా అంచనాలు పెరగాల్సింది పోయి తగ్గడం కొంచెం ఆందోళనకు గురి చేసిన మాట వాస్తవం. తాజాగా ఆ అనుమానాలకు వీలైనంత క్లారిటీ వచ్చింది.
ఆహా ఓహో అనే రేంజ్ లో జైలర్ 2 అద్భుతాలు చేయలేదు. అలాని నిరాశపరచలేదు. ఎక్కువ కష్టపెట్టకుండా రజనీకాంత్ నుంచి గూస్ బంప్ మూమెంట్స్ ఎలా రాబట్టుకోవాలో డిగ్రీ చేసిన నెల్సన్ దానికి తగ్గట్టే స్టార్ క్యామియోలు వాడుకుని పని కానిచ్చేశాడు. సెకండాఫ్ గురించి మిశ్రమ స్పందన ఉన్నా ఓవరాల్ గా అభిమానులు, మాస్ మూవీ లవర్స్ ని అయితే మెప్పించగలిగాడు. కామన్ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తాడనేది వీకెండ్ అయ్యాక తెలుస్తుంది. అప్పటిదాకా వేచి చూడాలి.
ఇక తారక్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. నెల్సన్ దిలీప్ కుమార్ నెక్స్ట్ చేయబోయే సినిమా కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్. దీని అనౌన్స్ మెంట్ ఆల్రెడీ వీడియో టీజర్ రూపంలో వచ్చి నెలలు దాటేసింది. అయితే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదానే దాని మీద చెన్నై వర్గాల్లో రకరకాల ఊహాగానాలున్నాయి. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు నిర్మాత నాగవంశీ. ఇది రెండు సంవత్సరాల వెనుకటి ముచ్చట.
తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయింది. భవిష్యత్తులో అయినా ఈ కాంబో జరగాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే సింపుల్ కథలో మాస్ ఊగిపోయేలా చేయడంలో నెల్సన్ ఆరితేరాడు. కొంచెం డార్క్ కామెడీ జోడించి నవ్వించడంలోనూ సక్సెసవుతున్నాడు. రజని లాంటి డెబ్భై ఏళ్ళ సీనియర్ కే అలా చేస్తే ఇక ఎనర్జీతో ఉరకలు వేసే జూనియర్ ఎన్టీఆర్ తో వండర్స్ చేయొచ్చు. కొంచెం లేట్ అయినా సరే తనని నమ్మి సినిమా చేస్తే తారక్ నిరాశపడకపోవచ్చు.
This post was last modified on October 16, 2026 11:56 am
తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…
ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం…
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల…
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు పార్టీ నాయకత్వాన్ని మండల స్థాయి నుంచి జిల్లా…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ముఖ్యంగా పోగొట్టుకున్నచోటే ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి…