ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.
దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి? కేటీఆర్ ఇప్పటికే తన సమర్థతను ఫ్రూవ్ చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా హాజరయ్యారు. పద్మారావు గౌడ్ మాట్లాడేందుకు మైకు వద్దకు వచ్చి.. తన తొలిపలుకుల్లోనే త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కు ముందస్తు అభినందనలు అని ఆయన ముఖానే పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీనికి మంత్రి కేటీఆర్ చిరు మందహాసం చేయటం తప్పించి మరింకెలాంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన చిరునవ్వే చెప్పాల్సిన విషయాల్ని చాలానే చెప్పేసినట్లుగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్ ను కుర్చోబెట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందన్న భావన కలుగక మానదు.
This post was last modified on January 21, 2021 5:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…