Political News

ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం పవన్

2024 ఎన్నికల ముందు నుంచి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదర్చడంలో ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు ఉన్నప్పటికీ బాబు, పవన్ లు వాటిని సెట్ చేసుకుంటూ కూటమి పార్టీల మధ్య ఐక్యతను కొనసాగిస్తున్నారు. ఇక, ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ పార్టీల మధ్య ఐక్యత మరింత బలంగా ఉండాల్సిన అవసరముంది.

ఇటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంలో మొట్టమొదట రోడ్ల మీదకు వచ్చింది జనసేన కార్యకర్తలు, వీర మహిళలేనని పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. ఆల్రెడీ అప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ఉన్నారు. అనకాపల్లి మొదలు అమెరికా వరకు టీడీపీ, చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు అంతా ఆందోళనలు చేపట్టారు. ఇక, హైదరాబాద్ లో అయితే, చంద్రబాబుకు సంఘీభావంగా నిరసనలు తెలవపవద్దని అప్పటి అధికార పార్టీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు కూడా.

అయితే, టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు అని పవన్ అని ఉంటే బాగుండేది. అయితే, పవన్ ఏ ఉద్దేశ్యంతో అన్నారో అన్నది ఆయనకు తెలుసు. కానీ, ఆ కామెంట్స్ విన్న టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో టీడీపీ చేసిన నిరసనల తాలూకు ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతున్న కీలక సమయంలో ఇది రెండు పార్టీలకు మంచిది కాదు.

కాబట్టి, పవన్ ఆ వ్యాఖ్యలుకు వివరణగా స్పష్టతనిస్తూ ఒక వీడియో విడుదల చేయడమో, లేదంటే మరేదైన సందర్భంగా క్లారిటీ ఇవ్వడమో చేస్తే బాగుంటుంది. జనసేనలోని చిన్నాచితకా నేతలు, కార్యకర్తలు ఇలా మాట్లాడారు అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ, ఏది ఏమైనా…పవన్ స్థాయి నేత ఈ తరహా సున్నితమై వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి. పొరపాటు చేసి ఉంటే… వెంటనే క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెంచేందుకు గోతికాడ నక్కలా కాచుకొని ఉన్న వైసీపీ నేతలకు ఇదొక ఆయుధంగా మారుతుంది.

This post was last modified on October 12, 2026 2:10 pm

Share

Recent Posts

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

19 minutes ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

23 minutes ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

1 hour ago

డిజాస్టర్ హీరోతో డిజాస్టర్ డైరెక్టర్?

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యశ్. కేజీఎఫ్-2 తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అని…

2 hours ago

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

2 hours ago

డ్యూడ్ హీరో… మోదీనే పొమ్మన్నాడుగా

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…

2 hours ago