బెంగళూరులో ఓ వ్యక్తికి వచ్చిన రూ.500 ట్రాఫిక్ చలాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూటీ నడుపుతున్న ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నారు. బండిపై ఆయన ఒక్కరే ఉన్నారు. అయినా వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదంటూ చలాన్ వచ్చింది. చలాన్‌తో పాటు ఉన్న ఫొటో చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆయన వెనుక మనిషి లేరు.. వీపుకు తగిలించుకున్న గిటార్ ఉంది.
సౌవిక్ దత్తా అనే వ్యక్తి గిటార్‌ను బ్యాగ్‌లో పెట్టుకుని వీపుకు తగిలించుకొని స్కూటీపై వెళ్తున్నారు. ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్న AI కెమెరా ఆ గిటార్‌ను వెనుక కూర్చున్న వ్యక్తిగా పొరపాటుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారనే ఉల్లంఘన కింద రూ.500 చలాన్ జారీ అయింది. తనకు వచ్చిన చలాన్‌కు సంబంధించిన వివరాలను సౌవిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
కర్ణాటకలో బైక్ లేదా స్కూటీ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా అక్కడ హెల్మెట్ ధరించాలి. ఈ కేసులో స్కూటీపై రెండో వ్యక్తి లేకపోయినా, గిటార్‌ను మనిషిగా కెమెరా గుర్తించడంతో సమస్య వచ్చింది. అందుకే హెల్మెట్ పెట్టుకున్న సౌవిక్‌కు కూడా వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదనే కారణంతో ఫైన్ పడింది.
బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు AI ఆధారిత కెమెరాలను ఉపయోగిస్తున్నారు. వాహనాల నంబర్లతో పాటు హెల్మెట్ వంటి ఉల్లంఘనలను గుర్తించడంలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు. సౌవిక్‌కు వచ్చిన చలాన్ విషయం బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. పరిశీలన తర్వాత ఈ చలాన్ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on September 29, 2026 12:09 pm
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…