ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆవేశ పడుతున్నారంటూ.. కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తరచుగా ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో మాట్లాడుతున్న తీరు చూస్తే.. ఇదే వ్యాఖ్యలు వినిపించడానికి కారణమవుతున్నాయని అనుకోవచ్చు. బహుశ ఈ విషయాన్ని గ్రహించారో ఏమో.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆవేశం లేదని.. ఆలోచనే ఉందని చెప్పుకొచ్చారు.
మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధ నేత రోశయ్య వర్థంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోశయ్య లాంటి సమర్థుడైన సహచరుడు లేకపోవడం వల్లనే ప్రస్తుతం అసెంబ్లీలో ఇబ్బందులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆయనే కనుక ఉంటే.. ముఖ్యమంత్రిగా తన పని సులువై ఉండేదని అన్నారు. నిబద్ధతకు, విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం రోశయ్య అంటూ ప్రశంసలు గుప్పించారు.
ఇక, తనను గుర్తించిన మొదటి వ్యక్తి రోశయ్యేనని సీఎం రేవంత్ రెడ్డిచెప్పారు. తనలోని గుణాలను మెచ్చి.. రాజకీయంగా పైకి వస్తావని ప్రోత్సహించారని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రిగా, ముఖ్యమంత్రిగా రోశయ్య తనకు అనేక రూపాల్లో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆవేశపడతారని చాలా మంది అంటారని.. కానీ, ఆవేశం కన్నా.. ఆలోచనే ముఖ్యమని తనతో అనేక సందర్భాల్లో రోశయ్య చెప్పారని గుర్తు చేసుకున్నారు.
గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారంతా.. రోశయ్య కారణంగానే ప్రశాంతంగా ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తదితర ముఖ్యమంత్రులు అధికారంలో స్థిరంగా కొనసాగడానికి రోశయ్య చేసిన సేవలే కారణమని తెలిపారు. రోశయ్య 100 శాతం నిఖార్సైన హైదరాబాదీ అని, ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని తెలిపారు. ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని అన్నారు. అలాగే.. తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా హైదరాబాద్‌లో పెడతామని అన్నారు.
This post was last modified on September 15, 2026 7:32 am
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…