నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200 కోట్లు పెట్టేశాడు ఈ సినిమా మీద నిర్మాత. ఇలాంటి సినిమాకు ట్రైలర్ లేదు అనగానే ప్రేక్షకులకు గతుక్కుమంది. కాస్త క్రేజున్న ఏ సినిమా రిలీజ్‌కు రెడీ అయినా.. ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. సినిమాలో ఏం చూడబోతున్నదీ ప్రేక్షకులకు అవగాహన కల్పించేది ట్రైలరే.
కేవలం ఆడియన్సే కాదు.. సినిమాను కొనే బయ్యర్లు కూడా తాము ఎలాంటి ప్రాడక్ట్ మీద పెట్టుబడి పెట్టామో తెలుసుకోవడం కోసం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ వీళ్లందరికీ నిరాశ కలిగిస్తూ ‘ప్యారడైజ్’ టీం ట్రైలర్ లేదని చెప్పేసింది. ఐతే ట్రైలర్ లేనంత మాత్రాన టీంకు సినిమా మీద కాన్ఫిడెన్స్ లేదనుకోవడం.. ఇలా చేయడం వల్ల సినిమాకు నష్టం జరిగిపోతుందని అనుకోవడం తప్పు. ఒకప్పుడు ఈ ట్రైలర్ అనే కాన్సెప్టే లేకుండా సినిమాలు రిలీజయ్యేవి. ఈ కల్చర్ మొదలయ్యాక కూడా కొన్ని చిత్రాలకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు.
తెలుగు సినిమా చరిత్రలోన అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలబడ్డ ‘మహానటి’ సినిమాకు టీం ట్రైలర్ రిలీజ్ చేయనే లేదు. కేవలం టీజర్‌తోనే సరిపెట్టింది టీం. ఆ టీజర్ వచ్చినపుడు కూడా కొంత విమర్శలు వచ్చాయి. అయినా టీం ధీమాగా ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేసింది. అది ఎంత అద్భుతమైన ఫలితాన్ని అందుకుందో తెలిసిందే.
ఇక విజయ్ దేవరకొండను పెద్ద స్టార్‌గా మార్చిన ‘గీత గోవిందం’ సినిమాకు కూడా టీం ట్రైలర్ వదల్లేదు. టీజర్, ఇతర ప్రోమోలతోనే సినిమాకు కావాల్సినంత క్రేజ్ రావడంతో ట్రైలర్ కట్ చేయలేదు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ట్రైలర్ లేకుండా వచ్చి నిరాశపరిచిన సినిమాలు కూడా లేకపోలేదు. తమిళంలో కబాలి, మాస్టర్ సినిమాలు ట్రైలర్ లేకుండా వచ్చి డిజప్పాయింట్ చేశాయి.
ఐతే ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నది అన్నది పక్కన పెడితే.. ‘ది ప్యారడైజ్’కు ఇప్పటికే కావాల్సినంత హైప్ ఉంది కాబట్టి ట్రైలర్ ద్వాారా కొత్తగా హైప్ ఎక్కించాల్సిన పని లేదు. పైగా 24న సినిమాను రిలీజ్ చేయడం కోసం టీం రేయింబవళ్లు పని చేయాల్సిన పరిస్థితి. ఈ హడావుడిలో టైం పెట్టకపోతే, ట్రైలర్ కట్ సరిగా లేకపోతే.. సినిమాకు అది డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ట్రైలర్ లేకుండా సినిమాను రిలీజ్ చేసినా పర్వాలేదనే చెప్పాలి.
This post was last modified on September 13, 2026 6:08 pm
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…