Movie News

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ వైపు అడుగులు వేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు పెళ్లయిందంటే వాళ్ల నుంచి మునుపటి హాట్‌నెస్ ఆశించలేం. సంప్రదాయబద్ధమైన, నటనకు ఎక్కువ ప్రాధాన్యమున్న పాత్రల వైపు అడుగులు వేస్తుంటారు. బయట వాళ్ల అప్పీయరెన్స్ కూడా మారిపోతుంటుంది.

కానీ మలయాళ కుట్టి కీర్తి సురేష్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆమె కెరీర్లో చాలా ఏళ్లు ట్రెడిషనల్ రోల్సే చేసింది. ఎక్స్‌పోజింగ్ జోలికి అస్సలు వెళ్లేది కాదు. బయట కనిపించే తీరు కూడా కట్టుదిట్టంగా ఉండేది. కానీ పెళ్లయ్యాక మాత్రం ఆమె తీరు మారిపోయింది. గ్లామర్ రోల్స్ చేస్తోంది. ఏదైనా ఈవెంట్లకు హాజరైనా హాట్ హాట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తోంది. గత రెండేళ్లలో ఎన్నోసార్లు తనను అలాగే చూశాం.

తాజాగా టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన కీర్తి సురేష్ అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్‌లో హీరోయిన్లు డిజైనర్ డ్రెస్సుల్లో చాలా హాట్ హాట్‌గా రెడీ అయి వస్తారన్న సంగతి తెలిసిందే. రోమ్‌కు వెళ్తే రోమన్‌లా ఉండాలన్నట్లు.. కీర్తి కూడా ట్రెండుకు తగ్గట్లే తయారై వచ్చింది.

టొరంటోకు సంబంధించి కీర్తి ఫొటోలు, వీడియోలు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె క్లీవేజ్ షో చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. పెళ్లయ్యాక కీర్తి ఇంతలా మారిపోయిందేంటి.. ఇన్నేళ్లు ఈ హాట్‌నెస్‌ను దాచేసిందేంటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో కీర్తి నటించిన ‘డొరోతీ’ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ఆమె విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో నటిస్తోంది.

This post was last modified on September 13, 2026 6:32 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

3 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

5 hours ago