వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్, విజయనగరం జడ్పీ ఛైర్మన్ పదవుల నుంచి నుంచి ఆయన వైదొలగడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
బొత్స కుటుంబానికి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు అత్యంత సన్నిహితుడైన చిన్న శ్రీను పార్టీ వీడి టీడీపీలో చేరడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన నేతలు, కార్యకర్తల సమావేశంలో బొత్స భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు.
చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో బొత్స, ఆయన తనయురాలు అనూష సమావేశమయ్యారు. చిన్న శ్రీను వ్యవహారంపై చర్చ జరిగింది. అయితే, అనూహ్యంగా చిన్న శ్రీనుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటి వరకూ బొత్స తరఫున ఆయన నియోజకవర్గం చీపురుపల్లి బాధ్యతలను నిర్వహించిన మజ్జి శ్రీను హఠాత్తుగా పార్టీని వీడడం బొత్స జీర్ణించుకోలేకపోయారు.
మజ్జి శ్రీనుకు సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా వైసీపీలో ఉంటారా? తనకు మద్దతుగా నిలుస్తారా? అన్న బెంగతో బొత్స భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది.
ఏడుస్తున్న బొత్సను ఆయన రాజకీయ వారసురాలు అనూష సముదాయించారు. ఇటీవల ఓ సందర్భంలో ఇలాగే బొత్స భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, ఒకప్పుడు ఉన్న ఫైర్ బొత్సలో ఇప్పుడు లేదని కార్యకర్తలు అనుకుంటున్నారు.
This post was last modified on September 10, 2026 2:49 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…