Movie News

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్ చేసినా చాలు అనిపిస్తోంది గత రెండు రోజులుగా తెలుగు ట్విట్టర్లో నడుస్తున్న గొడవ చూస్తే. మొన్న ‘ఎపిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన సందీప్‌ను యాంకర్ సుమ ఒక ప్రశ్న అడిగింది. ‘ఎపిక్’ మూవీలో లీడ్ క్యారెక్ట‌ర్ల గురించి చెబుతూ టీం శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో హీరో లాంటి క‌థానాయ‌కుడు, సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోల్లాంటి హీరోయిన్ అని అభివ‌ర్ణించ‌డంపై సుమ సందీప్ రెడ్డి అభిప్రాయం అడిగింది.

దానికాయన తనకు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు నచ్చరని తేల్చేశాడు. ఇక అంతే.. దీని మీద తెలుగు సోషల్ మీడియా రెండుగా విడిపోయి తెగ కొట్టేసుకుంటోంది. కొందరు సందీప్ భలే కామెంట్ చేశాడని పొగుడుతుండగా.. ఇంకొందరేమో ఆయన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు బాధ్యతాయుతంగా ఉంటారని.. మహిళలను గౌరవిస్తారని.. పురుషాధిక్యత చూపించరని.. అలాంటి పాత్రలు సందీప్ రెడ్డి లాంటి వాళ్లకు ఎలా నచ్చుతాయని ఒక వర్గం ఆయన మీద విరుచుకుపడుతోంది.

సందీప్ సినిమాల్లో మేల్ క్యారెక్టర్ల డామినేషన్.. మహిళల పాత్రలను చూపించే విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతూ.. శేఖర్ కమ్ముల ఈ విషయంలో జెమ్ అంటూ ఆయన్ని కొనియాడుతున్నారు. ఈ ఇద్దరు దర్శకుల సినిమాల్లో హీరోల పాత్రలను పోలుస్తూ.. విశేషణలు చేస్తున్నారు.
అదే సమయంలో ఇంకో వర్గం.. సందీప్ వైపు నిలుస్తోంది.

కమ్ముల సినిమాల్లో హీరోల పాత్రలు విచిత్రంగా ప్రవర్తిస్తాయని.. వాళ్లు నిజమైన మగాళ్లు కాదని.. కమ్ముల కమ్యూనిజం ప్రభావంతో పాత్రలు-కథలు రాస్తాడని.. పనిగట్టుకుని పురుషుల క్యారెక్టర్లను తగ్గించి మహిళల పాత్రలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు. సందీప్ హీరోలు దమ్మున్నోళ్లని.. కమ్ముల పాత్రలు చేవచచ్చినవని విమర్శిస్తున్నారు. ఇలా రెండు రోజులుగా తెలుగు సోషల్ మీడియా సందీప్ చేసిన చిన్న కామెంట్ మీద రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతుండడం గమనార్హం.

This post was last modified on September 10, 2026 4:21 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

47 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago