Political News

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో జగన్ కేంద్రానికి లేఖ రాసిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఇక, తమకు న్యాయస్థానాలపై నమ్మకం లేదు అనే రీతిలో వైసీపీ నేతలు గతంలో వ్యవహరించారు. అయితే, అధికారం పోయినా సరే వైసీపీ అధినేత జగన్ తీరు మారినట్లు కనిపించడం లేదు. తాజాగా మరోసారి న్యాయస్థానాలను అవమానించేలా జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

డీఎస్సీ స్కాం అనేది చంద్రబాబు చేసిన స్కాంలలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుంది అని జగన్ అన్నారు. దీంతో, చంద్రబాబును అరెస్ట్ చేసి నిన్నటికి మూడేళ్లయిందని, అయితే, ఆయనను అరెస్ట్ చేసిన ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదని చంద్రబాబు అన్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. చంద్రబాబు మీద ఉన్న ఆరోపణలు, కేసులన్నీ అధికారులను భయపెట్టి, బెదిరించి ఆయనే కొట్టేయించుకున్నాడనేది జగమెరిగిన సత్యమని జగన్ సెలవిచ్చారు. ప్రతి ఒక్కరికీ ఈ సత్యం అర్థమవుతుందని అన్నారు.

స్టేట్ గవర్నమెంట్ లో ఆయన పైనున్నాడు…అధికారులు కింద ఉన్నారు..డీఎస్సీ కేసు కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. వీరందరికీ రిపోర్టింగ్ అథారిటీ చంద్రబాబు అని, తనకు తానే క్లీన్ చీట్ ఇచ్చుకునే దౌర్భాగ్యకర పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. అయితే, స్కిల్ కేసుతో సహా మిగతా కేసులకు సంబంధించిన తీర్పులిచ్చిన న్యాయమూర్తులను, కోర్టులను అవమానించేలా, అనుమానించేలా జగన్ వ్యాఖ్యలున్నాయని విమర్శలు వస్తున్నాయి. కోర్టులపై జగన్ కు గౌరవం లేదని మరోసారి నిరూపితమైందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

This post was last modified on September 10, 2026 3:18 pm

Share

Recent Posts

టీమ్ఇండియా సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…

17 minutes ago

జనసైనికులను రెచ్చగొడుతున్నారా అంబటి?

కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…

21 minutes ago

రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…

28 minutes ago

డ్యామేజ్ తగ్గించే ప్రయత్నాలు ఎన్ని చేసినా

సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…

1 hour ago

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…

4 hours ago

దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం

విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…

4 hours ago