టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై నాయకా’ తెలుగు చిత్రం గురించి ఈ తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఆ సినిమాలో బూతు లేనిదే మాట్లాడడం చేతగాని తండ్రిగా కోటా శ్రీనివాసరావు..ఆ తండ్రి బూతులు నేర్చుకొని టీచర్లపై ప్రయోగించే కొడుకు నటన ఆకట్టుకుంటుంది. కోటా, ఆయన తనయుడి బూతు పురాణానికి చెక్ పెట్టే టీచర్ పాత్రలో నరేష్ మెప్పించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ నాయకుల బూతు పురాణం చూస్తే ‘హై హై నాయకా’ సినిమా గుర్తుకు వస్తోంది. హై హై నాయకా..అది ఏం నాలుక? అనిపిస్తోంది.
“రేవంత్ రెడ్డి అనే చిల్లర నా కొడుకు”… తాజాగా ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్య పదజాలంతో మాజీ మంత్రి, భావి ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ కేడర్ భావిస్తున్న కేటీఆర్ దూషించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
అయితే, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను పట్టుకొని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు చేసిన వ్యాఖ్యలు కూడా తక్కువేమీ కాదు. కేసీఆర్ చావును కోరుకుంటూ రేవంత్ రెడ్డి పదే పదే వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ అని, ఆయన చావాలని తాను కోరుకుంటున్నానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను చంపాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యాడని, అందుకే ఫాం హౌస్ మీదకు కాంగ్రెస్ నేతలను ఉసిగొల్పారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
ఇక, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ కూడా గతంలో నోరుపారేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలా, బూతులు తిట్టడంలో తెలంగాణ రాజకీయ నేతలు ఒకరిని మించి మరొకరు అన్న రీతిలో పోటీ పడుతున్నారు. ఇలా ఎవరిని తీయలేం…పెట్టలేం అన్న చందంగా తయారయ్యారు. అయితే, ఈ బూతు రాజకీయాల వల్ల ప్రజా సమస్యలు అటకెక్కుతున్నాయి. ఈ బూతు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు అన్న సంగతిని రాజకీయ నేతలంతా మరచిపోతున్నారు.
తమ ప్రతినిధులుగా ఈ నాయకులను ఎన్నుకొని చట్ట సభలకు పంపితే అక్కడ ప్రజా సమస్యలు చర్చించకుండా ఒకరిపై ఒకరు బూతులతో విరుచుకుపడడం, కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న సభా సమయాన్ని వృథా చేయడం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మాదిరి కాదు..ఇది డిజిటల్ యుగం..ప్రతీది క్షణాల్లో వైరల్ అవుతోంది అన్న సంగతి మన నేతాశ్రీలు గుర్తుపెట్టుకోవాలి.
This post was last modified on September 8, 2026 10:42 pm
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్‌లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…
థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…