Political News

తెలంగాణలో టీడీపీ వచ్చేది లేదు సచ్చేది లేదు: మహేష్

తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోనూ టీడీపీ కేడర్, లీడర్లు బలంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీటీడీపీ కాస్త బలహీన పడడం, ఆ క్రమంలో చాలామంది టీడీపీ నేతలు కాంగ్రెస్ లో, ఇతర పార్టీల్లో చేరడంతో టీడీపీ మరింత బలహీనపడిందన్నది వాస్తవం. కానీ, పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. అయితే, అసలు తెలంగాణలో టీడీపీ లేదని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

టీడీపీ మొలకెత్తుతదా తెలంగాణలో అని ఆయన ప్రశ్నిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకప్పటి టీడీపీ నేతలంతా కాంగ్రెస్ లో చేరారని చెప్పారు. పచ్చ కాంగ్రెస్ వస్తదా ఇక్కడా అని ప్రశ్నించారు. అంతేకాదు, ఇంకెక్కడి టీడీపీ? తెలంగాణలో టీడీపీ వచ్చేది లేదు సచ్చేది లేదు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, వాటి ద్వారా సృష్టించిన ఆస్తుల వివరాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలకు మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల పేరు చెప్పి వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు రాకపోగా, వాటిలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

This post was last modified on September 7, 2026 12:46 pm

Share

Recent Posts

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

38 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

44 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

12 hours ago